Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Digital Census India | జనగణన విధులను పక్కగా నిర్వహించాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Digital Census India | జనగణన విధులను పక్కగా నిర్వహించాలి

నిజామాబాద్

Digital Census India | జనగణన విధులను పక్కగా నిర్వహించాలి

జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో బుధవారం సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 5:04 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Digital Census India

అక్షరటుడే, ఇందూరు: Digital Census India | జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో బుధవారం సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.

Contents
  • Digital Census India | 2011లో చివరిసారిగా జనాభా గణన..
    • Digital Census India | ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలి..

Digital Census India | 2011లో చివరిసారిగా జనాభా గణన..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2011లో చివరిసారిగా జనాభా గణన జరిగిందని గుర్తు చేశారు. వాస్తవానికి 2021లో ఈ ప్రక్రియలు చేపట్టాల్సి ఉండగా.. కరోనా వల్ల నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ (Digital) విధానంలో జనాభా లెక్కల సేకరణ జరిపేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తొలి దశలో నివాస గృహాలతోపాటు అన్ని రకాల కట్టడాలు కుటుంబ వివరాలను సేకరించడం జరుగుతుందని చెప్పారు. రెండో విడతలు వ్యక్తిగత వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గతేడాది నల్గొండ జిల్లా తిప్పర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాల్లో ప్రయోగాత్మకంగా కుటుంబ, ఇళ్ల వివరాల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు.

Digital Census India

Digital Census India | ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలి..

జనగణనలో ప్రతిఒక్కరూ భాగస్వాములై వాస్తవ వివరాలు వెల్లడించాలని సూచించారు. ఏ ఒక్కరి వివరాలు బయటికి వెల్లడి కావని, నేరుగా సర్వర్​లో నిక్షిప్తమయ్యేలా సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈసారి సెల్ఫ్ డిక్లరేషన్ ఎంతో ముఖ్యమని అధికారులు, ఎన్యూమరేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాగా శిక్షణ ఈనెల 13 వరకు మూడు రోజులపాటు కొనసాగుతుంది. కార్యక్రమంలో బోధన్ ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం

Wines Closed on Holi | హోలీ పండుగకు వైన్స్​లు బంద్: సీపీ సాయిచైతన్య
National seminar NEP 2020 | ముగిసిన రెండు రోజుల జాతీయ సెమినార్
Manala Mohan Reddy | తండాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : మానాల మోహన్​రెడ్డి
Congress Committee Formation | కాంగ్రెస్​ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు
LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
TAGGED:census 2026 indiacensus training programDigital Census Indiadigital data collection indiagovernment census processindia population censusindia population surveyNizamabad District News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Induction Stove Demand Induction Stove Demand | మార్కెట్‌లో గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌ స్టాక్ లకు పెరిగిన డిమాండ్
Next Article Brahmotsavam Homam Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో హోమాలకు అద్భుతశక్తి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?