అక్షరటుడే, వెబ్డెస్క్ : Hansika Motwani Divorce | నటి హన్సిక (Actress Hansika) మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకుంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉండగా.. తాజాగా ముంబైలోని బాంద్రా కోర్టు (Bandra Court) వీరికి విడాకులను మంజూరు చేసింది.
హన్సిక మోత్వానీ డిసెంబర్ 2022లో వ్యాపారవేత్త భర్త సోహేల్ ఖతురియాను వివాహం చేసుకుంది. వారి విడాకుల పుకార్లు గత సంవత్సరం నుంచి కొనసాగుతున్నాయి. కానీ హన్సిక వాటిపై మౌనం వహించింది. తాజాగా ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేయడంతో, ఈ జంట అధికారికంగా వారి బంధాన్ని ముగించింది. పరస్పర అంగీకారంతో విడిపోవడానికి వీరు పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
Hansika Motwani Divorce | భరణం ఎంతంటే?
విడాకుల కోసం నటి హన్సిక ఎలాంటి భరణం (Alimony) కోరలేదని సమాచారం. సాధారణంగా సెలబ్రెటీ జంటలు విడిపోయిన సమయంలో భారీ మొత్తంలో భరణం చెల్లించడం చూస్తుంటాం. మోత్వానీ తరఫున న్యాయవాది అద్నాన్ షేక్ వాదనలు వినిపించారు. ఈ జంట వివాహం తర్వాత కొంతకాలం మాత్రమే కలిసి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
హన్సిక, ఆమె భర్త గత కొంతకాలంగా విడివిడిగానే నివసిస్తున్నారు. వీరిని కలపడానికి గతంలో కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వివాహాన్ని సామరస్యంగా ముగించడానికి ఇద్దరు అంగీకరించారు. ఇరుపక్షాలు మరొకరిపై ఎటువంటి ఆర్థిక, చట్టపరమైన వాదనలు చేయరని ధృవీకరిస్తూ అఫిడవిట్‌లను సైతం సమర్పించారు.

దీనిని కూడా చదవండి : Lavanya Tripathi Harassment | హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో వేధింపులు

