అక్షరటుడే, ఇందూరు: Illegal Constructions Action | నగరంలోని 8వ వార్డులో అక్రమ నిర్మాణాలపై (Illegal Constructions Action) తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ మఠం పవన్ (Matam Pawan Corporator) డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ (Nizamabad Municipal Corporation) దిలీప్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
Illegal Constructions Action | అనుమతి లేకుండా నిర్మాణాలు..
అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు జరిగాయని కార్పొరేటర్ వివరించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం (Telangana Municipal Act), టీఎస్‌బీపాస్ చట్టం (TS BPass Ac) ప్రకారం అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగాయన్నారు. అలాగే అనుమతించిన ప్లాన్‌కు విరుద్ధంగా కూడా కొందరు బిల్డర్లు (Municipal Administration) నిర్మాణాలు చేపట్టారన్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు ప్రజల భద్రత రహదారులు డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్ల ఏర్పాటుకు తీవ్రమైన సమస్యలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. త్రివర్ణ గణేష్ సొసైటీ కాలనీ, లలిత నగర్ ఫేస్-1, లలిత నగర్ ఫేస్-2, అయోధ్య నగర్, సీతారాం నగర్ కాలనీ, సాయి నగర్-1 ఏరియాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయన్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు తక్షణమే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ నిర్మాణాలపై తక్షణమే స్థాప్ వర్క్ నోటీసులు ఇవ్వాలని ఆయన కోరారు. చట్టవ్యతిరేక నిర్మాణాలపై సీలింగ్ లేదా కూల్చివేత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా మున్సిపాలిటీ నుంచి పర్యవేక్షణ జరగాలని ఆయన కోరారు.

ఇది కూడా చదవండి : Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక

