అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Meeting | కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy Municipal Meeting) నూతన పాలకవర్గ పరిచయ కార్యక్రమం వాడీవేడిగా సాగింది. పరిచయ కార్యక్రమం కాస్తా సాధారణ సర్వసభ్య సమావేశాన్ని (Telangana Municipal Politics) తలపించింది. కౌన్సిలర్ల పరిచయం నుంచి మొదలుకుని మాటల యుద్ధం కొనసాగింది.
Kamareddy Municipal Meeting | సమస్యల ఏకరువు..
తన వార్డులో కరెంట్ సమస్యపై అడిగితే ఏఈ ఇష్టానుసారంగా సమాధానం చెప్పారని, వెంటనే అతన్ని సరెండర్ చేయాలని (Kamareddy Municipality News) డిమాండ్ చేస్తూ 15వ వార్డు కౌన్సిలర్ సూరోజు వనిత పోడియం ముందు బైఠాయించి నిరసన (Councillors Protest) తెలిపారు. దాంతో మిగతా కౌన్సిల్ సభ్యులు సైతం వనితకు మద్దతు పలికారు. తక్షణమే ఏఈని సరెండర్ చేయాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లందరూ ఏకం కావడంతో ఏఈ క్షమాపణ చెప్పారు. మున్సిపాలిటీలో డ్రెయినేజీలు (Sanitation Problems Kamaredd) నిండిపోయాయని, శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని.. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వార్డుల కౌన్సిలర్లు ఈ విషయంపై అధికారులను నిలదీశారు.
Kamareddy Municipal Meeting | నీటి లీకేజీలు.. వీధిదీపాలు..
నీటి లీకేజీల సమస్య తీవ్రంగా (Water Leakage Issues) ఉందని, వీధి దీపాలను పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఎంతమంది లేబర్ పని చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని పట్టుబట్టారు. వార్డులలో అవసరమైన లేబర్ ఉండడం లేదని, ఎవరు పని చేస్తున్నారో.. ఎవరు పని చేయడం లేదో తెలియడం లేదన్నారు. పట్టణంలో మొత్తం ఎంతమంది లేబర్ ఉన్నారు.. ఎంతమంది విధులకు హాజరు అవుతున్నారు.. హాజరు కాని లేబర్లు ఎంతమంది ఉన్నారు. హాజరు కాని లేబర్ ఎక్కడ పని చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతమంది లేబర్ అధికారులు, నాయకుల ఇళ్లల్లో పనిచేస్తూ మున్సిపల్ నుంచి జీతాలు పొందుతున్నారని, వారి వివరాలు ఇవ్వాలన్నారు.
Kamareddy Municipal Meeting | వచ్చే కౌన్సిల్ సమావేశం నాటికి..
వచ్చే కౌన్సిల్ సమావేశం నాటికి పూర్తిస్థాయి లేబర్లు (Local Governance News) తమ కళ్లముందు హాజరు కావాలని, ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో తమకు నేరుగా పరిచయం చేయాలని కౌన్సిలర్లు సూచించారు. వార్డు ఆఫీసర్లు వార్డుల్లో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని, వార్డు ఆఫీసర్ సమస్య పరిష్కరించాక కౌన్సిలర్ వద్దకు ఎందుకు వస్తుందని నిలదీశారు. కొంతమంది వార్డు ఆఫీసర్లు, ఇతర శాఖల అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అధికారులందరు కౌన్సిలర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పని చేస్తారని కమిషనర్ హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి, ఆయా వార్డు కౌన్సిలర్లు, అధికారులు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Water Tank Inspection | వాటర్ ట్యాంక్ ఎక్కిన కలెక్టర్.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన

