Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

జాతీయం

Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటింగ్‌తో తీర్మానాన్ని సభ తిరస్కరించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 7:17 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Lok Sabha Speaker

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lok Sabha Speaker | లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా (Om Birla)పై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్ జరగకుండానే మూజువాణి ఓటింగ్‌తో తీర్మానాన్ని సభ తిరస్కరించింది.

Contents
  • Lok Sabha Speaker | సభ వాయిదా
    • Lok Sabha Speaker | సభా నియమాలు పాటించాలి

స్పీకర్​ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ (Congress) సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాసం ప్రవేశ పెట్టాయి. ఈ తీర్మానంపై దాదాపు 10 గంటల చర్చ జరిగింది. బుధవారం సాయంత్రం వాయిస్​ ఓటు ద్వారా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్యానెల్​ స్పీకర్​ జగదాంబిక పాల్ (Jagadambika Pal) ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలు నినాదాలు చేస్తున్న సమయంలో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు.

Lok Sabha Speaker | సభ వాయిదా

తీర్మానంపై ఓటింగ్​ కోసం ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని పాల్ కోరారు. అయితే విపక్ష సభ్యులు నిరసన కొనసాగించడంతో తీర్మానాన్ని వాయిస్ ఓటు ద్వారా తిరస్కరించారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్య పునాదినే ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు.

Lok Sabha Speaker | సభా నియమాలు పాటించాలి

amit shah

రాజ్యాంగం స్పీకర్​కు మధ్యవర్తి పాత్రను ఇచ్చిందని షా గుర్తు చేశారు. సభ పనితీరు విశ్వాసం, నియమాలకు కట్టుబడి ఉండటంపై ఆధారపడి ఉంటుందన్నారు. స్పీకర్ అధికార పక్షం, ప్రతిపక్షం రెండింటికి ప్రాతినిధ్యం వహిస్తూ తటస్థ సంరక్షకుడిగా వ్యవహరిస్తారని చెప్పారు. స్పీకర్ సమావేశాలను ఎలా నిర్వహించాలో మార్గనిర్దేశం చేయడానికి ఈ లోక్‌సభ ద్వారా నిర్దిష్ట నియమాలు ఉన్నట్లు చెప్పారు. సభ్యులు దాని నియమాలు పాటించాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి : Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ

Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!
Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
LPG Booking Interval | గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​పై కేంద్రం కీలక నిర్ణయం
Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు
TAGGED:Amit ShahIndian ParliamentIndian PoliticsLok SabhaNo Confidence MotionOm BirlaOpposition ProtestVoice Vote
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Municipal Meeting | Kamareddy Municipal Meeting | గరంగరంగా కామారెడ్డి బల్దియాలో పరిచయ కార్యక్రమం.. అధికారులపై కౌన్సిలర్ల ఫైర్..
Next Article ALLEN India Campaign ALLEN India Campaign | విద్యార్థినుల కోసం అలెన్ ‘స్పెషల్ ఆఫర్’.. పోటీ పరీక్షల్లో రాణించేందుకు బంపర్ స్కాలర్‌షిప్స్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?