అక్షరటుడే, కామారెడ్డి : Couple Theft Arrest | అదనపు ఆదాయం కోసం భార్యాభర్తలు(Couple Theft Arrest) అడ్డదారి తొక్కారు. చెత్త కాగితాలు, వాటర్ బాటిళ్లు ఏరుకుంటూ ఒకరు.. స్క్రాప్ కొనుగోలు చేస్తామంటూ మరొకరు చోరీలకు తెగబడ్డారు. ఇలా చోరీలకు పాల్పడుతున్న భార్యాభర్తలకు కామారెడ్డి పోలీసులు (Kamareddy Police) చెక్ పెట్టారు.
Couple Theft Arrest | భిక్కనూరు పోలీస్స్టేషన్లో..
భిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి (Kamareddy) సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న భిక్కనూరు (Bhiknoor Theft Cas) మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో రెండు తులాల వెండి పట్టగొలుసులు, రూ.10 వేలు నగదు చోరీ జరిగింది,
భిక్కనూరు వెంకటేశ్వర ఆలయంలో ఈనెల 8న తాళం పగులగొట్టి హుండీలో ఉన్న సుమారు రూ.వెయ్యి ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనాల కేసులలో పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం బీటీఎస్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. లంబాడీ శ్రావణి అనే మహిళ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో తన భర్త శ్రీనివాస్తో కలిసి అదనపు ఆదాయం కోసం చోరీలను వృత్తిగా మార్చుకున్నట్టు చెప్పుకొచ్చింది.
Couple Theft Arrest | తాళం వేసిన ఇళ్లు టార్గెట్..
తాళం వేసిన ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి, క్షణాల్లో తాళం పగుల గొట్టి చోరీకి పాల్పడుతున్నట్టుగా పోలీసుల (Local Crime Report) విచారణలో తేలింది. గత (ఫిబ్రవరి) నెలలో మాధిమానిక్ గ్రామంలో 4 తులాల బంగారం దొంగిలించారు. ఈ సొత్తును నర్సాపూర్కు చెందిన వ్యాపారి పర్థం ఏలియా అలియాస్ ప్రవీణ్ వద్ద విక్రయించారు. ఇలా వచ్చిన రూ.1.70 లక్షలతో విలాసాల కోసం బైక్ కొనుగోలు చేశారు.
ఈ మేరకు వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి భర్త పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ (Telangana Crime News) తెలిపారు. శ్రావణి, వ్యాపారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు తులాల వెండి పట్టీలు, ఒక ఫోన్, రెండు బైక్, పల్సర్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ను త్వరలోనే (Police Investigation India) పట్టుకుంటామన్నారు. ఈ సమావేశంలో భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Student Counseling Program | విద్యార్థులు అనవసర విషయాల్లో తలదూర్చొద్దు: ఏఎస్పీ చైతన్య రెడ్డి

