Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sudarshana Chakra Story | సూర్య తేజస్సుతో పుట్టిన ఆయుధం.. సుదర్శన చక్రం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Sudarshana Chakra Story | సూర్య తేజస్సుతో పుట్టిన ఆయుధం.. సుదర్శన చక్రం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

భక్తితాజా వార్తలు

Sudarshana Chakra Story | సూర్య తేజస్సుతో పుట్టిన ఆయుధం.. సుదర్శన చక్రం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

దుష్టత్వాన్ని తుడిచిపెట్టి, మంచిని కాపాడే సుదర్శన చక్రం భక్తులకు ఎల్లప్పుడూ రక్షణ కవచంలా నిలుస్తుంది.

Naresh chandan
Last updated: మార్చి 11, 2026 10:22 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
Sudarshana Chakra Story | సూర్య తేజస్సుతో పుట్టిన ఆయుధం.. సుదర్శన చక్రం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?
Sudarshana Chakra Story | సూర్య తేజస్సుతో పుట్టిన ఆయుధం.. సుదర్శన చక్రం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sudarshana Chakra Story | మన పౌరాణిక గాథల్లో అత్యంత విశిష్టమైనది.. తిరుగులేని శక్తి కలిగినది శ్రీమహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం Sudarshana Chakra. విష్ణుసహస్రనామం సైతం ఈ మహా ఆయుధంలోని అనంతమైన శక్తిని, దాని ప్రాముఖ్యాన్ని కొనియాడింది. లోకంలో అన్యాయం పెరిగినప్పుడు దుష్ట శిక్షణ కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం విష్ణుమూర్తి ఈ చక్రాన్ని ప్రయోగిస్తుంటారు. అసలు ఈ శక్తిమంతమైన ఆయుధం ఎలా ఉద్భవించిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.

Contents
  • Sudarshana Chakra Story | సూర్యతేజస్సుతో ఉద్భవించిన వైనం:
    • Sudarshana Chakra Story | దుష్టశిక్షణలో సుదర్శన చక్రం:
      • నేటికీ సజీవమైన ప్రాధాన్యం:

Sudarshana Chakra Story | సూర్యతేజస్సుతో ఉద్భవించిన వైనం:

పురాణాల ప్రకారం.. దేవశిల్పి అయిన విశ్వకర్మ ఈ సుదర్శన చక్రాన్ని రూపొందించారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. విశ్వకర్మ తన కుమార్తెను సూర్యభగవానుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే, సూర్యుడి అపరిమితమైన వేడిని భరించే శక్తి ఆమెకు లేకపోయింది. తన కుమార్తె పడుతున్న ఇబ్బందిని గమనించిన విశ్వకర్మ, సూర్యుడి వేడిని, కాంతిని కొంత తగ్గించేందుకు ఆయనను సానపట్టారు.

ఆ సమయంలో సూర్యుడి నుంచి రాలిన పవిత్రమైన చూర్ణంతో విశ్వకర్మ మూడు అద్భుతమైన వస్తువులను సృష్టించారట..

మొదట పుష్పక విమానాన్ని తయారు చేశారు. ఆ తర్వాత శివుడి కోసం త్రిశూలాన్ని రూపొందించారు. చివరగా అత్యంత వేగవంతమైన, అజేయమైన సుదర్శన చక్రాన్ని తయారు చేశారు.akshara today .jpg chakra

Sudarshana Chakra Story | దుష్టశిక్షణలో సుదర్శన చక్రం:

అధర్మాన్ని అంతమొందించడంలో సుదర్శన చక్రం పాత్ర అమోఘం. దీనికి సంబంధించిన కొన్ని ప్రధాన ఘట్టాలు ఇవే:

శిశుపాల వధ: శ్రీకృష్ణుడు తన మేనత్తకు ఇచ్చిన మాట ప్రకారం శిశుపాలుడి వంద తప్పులను భరిస్తాడు. కానీ ఆ హద్దు దాటగానే, సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడిని సంహరించి లోకాన్ని రక్షిస్తాడు.

గజేంద్ర మోక్షం: మొసలి నోట చిక్కుకున్న గజేంద్రుడిని కాపాడేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపి ఆపదను తొలగిస్తారు. ఇలా ఎన్నో సందర్భాల్లో భక్తులను రక్షించడానికి ఈ ఆయుధం తోడ్పడింది.

నేటికీ సజీవమైన ప్రాధాన్యం:

ఆధ్యాత్మికంగా సుదర్శన చక్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీరంగం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు ఉండటం విశేషం. అంతేకాకుండా, తిరుమల బ్రహ్మోత్సవాల్లో ముగింపు రోజైన చక్రస్నానం కార్యక్రమం స్వామి వారి సుదర్శన చక్ర విశిష్టతను భక్తులకు చాటిచెబుతుంది. స్వామి పుష్కరిణిలో జరిగే ఈ చక్రస్నానం చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు.

ఇది కూడా చదవండి: Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు

March 11 Horoscope | ఆభరణాలు, అలంకరణ వస్తువులపై పెట్టుబడి.. ఈ రాశుల వారికి తిరుగులేని ధన యోగం!
Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!
Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
TAGGED:hindu mythologyhindu puranasindian mythology storieslord vishnu weaponspiritual storiessudarshana chakra originsudarshana chakra storyvishnu sudarshan chakra
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Palmistry Y Sign | అరచేతిలో ఈ గుర్తు ఉందా.. అయితే కోటీశ్వరులయ్యే జాతకం! Palmistry Y Sign | అరచేతిలో ఈ గుర్తు ఉందా.. అయితే కోటీశ్వరులయ్యే జాతకం!
Next Article March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?