అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ambulance Miracle Incident | ఆ మహిళ బ్రెయిన్ డెడ్ Brain Dead కు గురైంది. బాధిత కుటుంబం ఆమె ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అంత్యక్రియల కోసం ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారు. ఆ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మార్గమధ్యలో రోడ్డుపై గుంత కారణంగా అంబులెన్స్ ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనైంది. అదే సమయంలో అద్భుతం జరిగింది. అపస్మారక స్థితిలో ఆమె తిరిగి ఊపిరి తీసుకోవడం మొదలెట్టింది.
అనూహ్యంగా జరిగిన ఘటనతో ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను తిరిగి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందించగా.. ఆమె తిరిగి పూర్తిగా కోలుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
Ambulance Miracle Incident | పరిస్థితి విషమించడంతో..
యూపీలోని పీలీభీత్ జిల్లాలో ఉండే వినితా శుక్లా.. అక్కడి జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా గత నెల (ఫిబ్రవరి) 22వ తేదీన ఇంటి పనులు చేస్తుండగా సడెన్‌గా కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో బరేలీలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమె ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వైద్యులు చేతులెత్తేశారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తిరిగి ఇంటికి తరలించే ఏర్పాట్లు చేసుకున్నారు.
Ambulance Miracle Incident | భారీ కుదుపుతో..
అదే నెల (ఫిబ్రవరి) 24వ తేదీన అంబులెన్సులో వినితాను తీసుకుని ఇంటికి బయలుదేరారు. కాగా, హరిద్వార్ – బరేలీ జాతీయ రహదారిపై ఓ చోట పెద్ద గుంత ఉంది. అందులో నుంచి అంబులెన్స్ వెళ్లడంతో వాహనం ఒక్కసారిగా భారీ కుదుపునకు గురైంది. ఆ కుదుపునకు అంబులెన్స్‌లో అపస్మారక స్థితిలో ఉన్న వినితా స్పృహలోకి వచ్చి, శ్వాస తీసుకోవడం ప్రారంభించినట్లు ఆమె భర్త కుల్దీప్ శుక్లా వెల్లడించారు.
కాగా, అప్పటికే ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. దీంతో వెంటనే ఆ ఏర్పాట్లు నిలిపివేయాలని గ్రామస్థులను కోరారు. దీంతోపాటు వినితాను అటు నుంచి అటే తిరిగి ఆసుపత్రికి తరలించారు. అప్పుడు నిశితంగా పరిశీలించిన వైద్యులు ఆమె కాలిపై ఏదో గాయం ఉందని గుర్తించారు. ఏదైనా కీటకం / విషపూరిత సర్పం కరిచిందని అనుమానించారు. ఆ మేరకు దాదాపు 12 రోజులపాటు ఐసీయూలో చికిత్స అందించడంతో ఆమె పూర్తిగా కోలుకున్నారు.

