Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం

తెలంగాణతాజా వార్తలు

Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం

రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను విభజించి నిర్వహించడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత సమర్థవంతమైన విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో కొత్త డిస్కం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Naresh chandan
Last updated: మార్చి 12, 2026 9:28 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం

అక్షరటుడే, హైదరాబాద్: Telangana Rythu DISCOM | తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం కాబోతోంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న Telangana State Northern Power Distribution Company Limited (TGNPDCL), Telangana State Southern Power Distribution Company Limited (TGSPDCL) కు అదనంగా మూడో డిస్కంను సర్కారు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Contents
  • Telangana Rythu DISCOM | రైతులకు పంపిణీ లక్ష్యం
    • Telangana Rythu DISCOM | ప్రధాన కార్యకలాపాలు
      • సీఎండీగా ముషార్రఫ్ అలీ ఫరూఖీ
      • బోర్డు ఆఫ్ డైరెక్టర్లు
      • రూ.5 కోట్ల షేర్ క్యాపిటల్
      • హైదరాబాద్‌లో రిజిస్టర్డ్ కార్యాలయం

కొత్త డిస్కంకు Telangana Rythu Power Distribution Company Limited (TGRPDCL) గా నామకరణం చేశారు. కంపెనీస్ యాక్ట్–2013 ప్రకారం ఈ కొత్త డిస్కంను ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు వెల్లడించింది.

Telangana Rythu DISCOM | రైతులకు పంపిణీ లక్ష్యం

తెలంగాణలో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు కొత్త డిస్కంను ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యవసాయం, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, నీటి సరఫరా వంటి విభాగాలకు కొత్త డిస్కం విద్యుత్ సరఫరా చేయనుంది.

Telangana Rythu DISCOM | ప్రధాన కార్యకలాపాలు

TGRPDCL ద్వారా చేపట్టబోయే ప్రధాన కార్యకలాపాలు ఇవి:

వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు విద్యుత్ సరఫరా విస్తరణ

కొత్తగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అందజేత

డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (DTRs), ఎల్టీ లైన్ల విస్తరణ, నిర్వహణ

విద్యుత్ వినియోగం గణాంకాలు, మీటరింగ్ వ్యవస్థ నిర్వహణ

వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్ సరఫరాakshara CMD

సీఎండీగా ముషార్రఫ్ అలీ ఫరూఖీ

కొత్తగా ఏర్పడిన డిస్కంకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషార్రఫ్ అలీ ఫరూఖీ Musharraf Ali Faruqui (IAS)ను నియమించారు. ఆయన నేతృత్వంలో సంస్థ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

బోర్డు ఆఫ్ డైరెక్టర్లు

TGRPDCL ప్రారంభ బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా విద్యుత్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరిలో:

  • Musharraf Ali Faruqui – CMD
  • Vanteru Thirupathi Reddy – డైరెక్టర్
  • P Krishna Reddy – డైరెక్టర్
  • Vanguru Mohan Rao – డైరెక్టర్
  • N Narasimhulu – డైరెక్టర్

రూ.5 కోట్ల షేర్ క్యాపిటల్

ఈ సంస్థకు రూ.5 కోట్ల షేర్ క్యాపిటల్‌ ను సర్కారు నిర్ణయించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వ తరఫున TGSPDCL – TGNPDCL సమానంగా అందించనున్నాయి.

హైదరాబాద్‌లో రిజిస్టర్డ్ కార్యాలయం

TGRPDCL సంస్థ రిజిస్టర్డ్ కార్యాలయం హైదరాబాద్‌లోని మింట్ కంపౌండ్‌లో ఏర్పాటు చేయనుంది.

Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
Balkonda House Theft | తాళం పగలగొట్టి.. ఇంట్లోకి చొరబడి.. బాల్కొండలో చోరీ!
Kukatpally Cash Robbery | కళ్లలో కారం చల్లి.. రూ.21 కోట్లు ఎత్తుకెళ్లారు
Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..
Fire Accident | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం : హైడ్రా కమిషనర్
TAGGED:agriculture power supply telanganamusharraf ali faruqui iasTelangana electricity newstelangana government orderstelangana power sectortelangana rythu discomtgnpdcl tgspdcl updatetgrpdl news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Farooq Abdullah Attack Farooq Abdullah Attack | ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. జెడ్ ప్లస్ భద్రతతో త్రుటిలో తప్పిన ప్రమాదం
Next Article Gas Shortage Ayodhya Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?