Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Farooq Abdullah Attack | ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. జెడ్ ప్లస్ భద్రతతో త్రుటిలో తప్పిన ప్రమాదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Farooq Abdullah Attack | ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. జెడ్ ప్లస్ భద్రతతో త్రుటిలో తప్పిన ప్రమాదం

జాతీయం

Farooq Abdullah Attack | ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. జెడ్ ప్లస్ భద్రతతో త్రుటిలో తప్పిన ప్రమాదం

జమ్మూలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 9:22 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Farooq Abdullah Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్: Farooq Abdullah Attack | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఫ‌రూఖ్ అబ్ధుల్లా (88)పై హత్యాయత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. జ‌మ్మూ నగరంలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఉన్న రాయల్ పార్క్‌ (Royal Park)లో నిర్వహించిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఈ దాడి విఫలమై, ఫరూక్ అబ్దుల్లా త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

Contents
  • Farooq Abdullah Attack | పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు
    • Farooq Abdullah Attack | ప్ర‌మాదం త‌ప్పింది..

Farooq Abdullah Attack | పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు

సమాచారం ప్రకారం, ఫరూక్ అబ్దుల్లా వేడుకలో పాల్గొంటున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనకు అత్యంత సమీపంగా వెనుక నుంచి చేరుకున్నాడు. అతడు తుపాకీతో ఫరూక్ అబ్దుల్లాపై గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపబోయాడు. అయితే వెంటనే స్పందించిన జెడ్ ప్లస్ భద్రతలో భాగంగా ఉన్న నేష‌న‌ల్ సెక్యూరిటీ గ్రాండ్ కమాండోలు దుండగుడిని పక్కకు నెట్టేశారు. దీంతో తూటా లక్ష్యాన్ని తప్పి ఫరూక్ అబ్దుల్లా సురక్షితంగా బయటపడ్డారు.

Farooq Abdullah Attack | ప్ర‌మాదం త‌ప్పింది..

ఈ సంఘటన అక్కడికక్కడే ఉద్రిక్తతకు దారి తీసింది. దాడి విఫలమైన వెంటనే అక్కడున్న ప్రజలు దుండగుడిని పట్టుకుని కొట్టారు. అనంతరం భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుండగుడిని క‌మ‌ల్ సింగ్ జ‌మ్వాల్ (65)గా గుర్తించారు. అతడు జమ్మూలోని పురానాస్ మండీ (Puranas Mandi) ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. అరెస్టు అనంతరం కూడా అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని, ఈ క్షణం కోసం గత 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానని చెప్పినట్లు సమాచారం.

ఈ ఘటనపై ఫరూక్ అబ్దుల్లా కుమారుడు, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమ‌ర్ అబ్ధుల్లా తీవ్రంగా స్పందించారు. ఇది కచ్చితంగా తన తండ్రిపై జరిగిన హత్యాయత్నమేనని ఆయన పేర్కొన్నారు. అల్లాహ్ దయవల్ల తన తండ్రి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు. అదే సమయంలో భద్రతా వ్యవస్థపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్ ప్లస్ భద్రతతో పాటు ప్రత్యేక కమాండోలు ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇంత సమీపంలోకి ఆయుధంతో దుండగుడు ఎలా చేరుకున్నాడన్న ప్రశ్నకు సమాధానం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన భద్రతా లోపాలను బయటపెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఘటన సమయంలో ఫరూక్ అబ్దుల్లా వెంట జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురేంద‌ర్ చౌద‌రి (Deputy CM Surender Chaudhary), ముఖ్యమంత్రి సలహాదారు నాసిర్ సోగామి కూడా ఉన్నారు. దేవుడి దయవల్ల అందరూ సురక్షితంగా బయటపడ్డారని నాసిర్ సోగామి తెలిపారు. దాడి వెనుక ఉద్దేశం ఏమిటన్నది ప్రస్తుతం చెప్పలేమని, దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి..: Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా

Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Nagpur Incident | హోలీ రోజు షాకింగ్ ఘటన.. మనవడిపై మరుగుతున్న నీళ్లు కుమ్మరించిన బామ్మ
Menaka Guruswamy Rajya Sabha | అందరి దృష్టి ఆ లాయర్‌పైనే.. ఎందుకంటే?
Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
Air India Flight Return | 8 గంటలు ప్రయాణించి తిరిగొచ్చిన విమానం.. ప్రయాణికులకు చేదు అనుభవం
TAGGED:Deputy CM Surender ChaudharyFarooq Abdullah AttackJammu and KashmirPuranas MandiRoyal Park
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article March 12 Gold Prices | మళ్లీ ఎగబాకిన బంగారం ధర.. కిలో వెండి రూ.3 లక్షలకు చేరువలో! March 12 Gold Prices | మళ్లీ ఎగబాకిన బంగారం ధర.. కిలో వెండి రూ.3 లక్షలకు చేరువలో!
Next Article Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?