Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Chandrababu Naidu Ratings | మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా రేటింగ్స్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Chandrababu Naidu Ratings | మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా రేటింగ్స్

ఆంధ్రప్రదేశ్​

Chandrababu Naidu Ratings | మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా రేటింగ్స్

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 12:17 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Chandrababu Naidu Ratings

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chandrababu Naidu Ratings | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు మంత్రుల పనితీరుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

Contents
  • Chandrababu Naidu Ratings | ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థానం ఎంత‌?
    • Chandrababu Naidu Ratings | సమన్వయంతో పని చేయాలి

సాధారణంగా మంత్రుల పనితీరుపై మౌఖికంగా చర్చించే సమావేశాలకంటే భిన్నంగా, ఈసారి ప్రతి మంత్రి కార్యాలయంలో ఫైళ్ల పరిష్కారం ఎంత వేగంగా జరుగుతోందో గణాంకాల ఆధారంగా విశ్లేషించి రేటింగ్స్ ప్రకటించడం విశేషంగా మారింది. పాలనలో వేగం పెరగడంతో పాటు ప్రజలకు సేవలు త్వరగా అందేలా చేయడమే ఈ సమీక్ష ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం వల్ల పరిపాలనలో జాప్యం జరుగుతుందని, నిర్ణయాలు ఆలస్యం అయితే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన సూచించారు.

Chandrababu Naidu Ratings | ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థానం ఎంత‌?

సీఎం ప్రకటించిన నివేదిక ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అత్యంత వేగంగా పనిచేస్తూ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన పనితీరును ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించినట్లు సమాచారం. శాఖలో వచ్చిన ఫైళ్లను త్వరగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిపాలన వేగంగా సాగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో రెండో స్థానంలో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు నిలిచారు. అనంతరం మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఈ రేటింగ్స్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Chandrababu Naidu Ratings

Chandrababu Naidu Ratings | సమన్వయంతో పని చేయాలి

హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ (Vangalapudi Anitha) ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో చివరి స్థానంలో నిలిచినట్లు సీఎం పేర్కొన్నారు. ముఖ్యమైన శాఖల్లో ఫైళ్లు ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండకూడదని, నిర్ణయాలను సమయానికి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మంత్రులందరూ తమ శాఖల్లో ఫైళ్ల కదలికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం అస్సలు సహించబోమని సుతిమెత్తగా హెచ్చరించారు. అధికారులు, మంత్రులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు వేగంగా అమలు అవుతాయని కూడా ఆయన తెలిపారు. ఈ సమీక్షలో వెల్లడైన రేటింగ్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పాలనలో పారదర్శకత, బాధ్యతను పెంచేందుకు సీఎం తీసుకున్న ఈ చర్యకు కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ సమీక్షతో మంత్రుల పనితీరు అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది.

ఇది కూడా చదవండి..: YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​

Vizianagaram Bus Fire | విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్ర‌యాణికుల్లో ఎంఎల్ఏ కూడా ఉన్నారా..!
Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్
Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు
YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​
TAGGED:Andhra PradeshChandrababu Naidu RatingsDeputy CM Pawan KalyanVangalapudi Anitha
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran attack US tanker Iran attack US tanker | అమెరికా ట్యాంకర్​పై ఇరాన్​ దాడి.. భారతీయుడి మృతి
Next Article Gas Shortage Protests Gas Shortage Protests | గ్యాస్​ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?