అక్షరటుడే, వెబ్డెస్క్: Gas Shortage Protests | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోగా.. డొమెస్టిక్ గ్యాస్ కొరత (Domestic gas shortage) సైతం నెలకొంటుంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గ్యాస్ కొరతపై పార్లమెంట్ ముందు ప్రతిపక్షాలు గురువారం ఆందోళన నిర్వహించాయి.
గ్యాస్ సంక్షోభానికి నిరసనగా ప్లకార్డులు పట్టుకుని ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), ఆయా పార్టీల ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా LPG కొరతతో ప్రజలు బారులు తీరుతున్నారని చెప్పారు. కోట్లాది మంది సామాన్య పౌరులు ఆహార భద్రతా సంక్షోభం వైపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Gas Shortage Protests | తక్షణం పరిష్కరించాలి
గ్యాస్ కొరతతో అనేక హోటళ్లు మూత పడ్డాయని వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రజలలో భయాందోళనలు వ్యాపిస్తున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి దీనిని జరగకుండా నిరోధించడంలో పూర్తిగా నిస్సహాయంగా ఉన్నారని విమర్శించారు. ఈ సంక్షోభానికి తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ అసమర్థతను బహిర్గతం చేయడానికి ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులో నిరసన తెలిపారన్నారు.
Gas Shortage Protests | చర్చ పెట్టాలి
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. LPG సిలిండర్ కొరతపై పార్లమెంట్లో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలు సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఏది చెబితే మోదీ అదే వింటున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం ఇప్పటివరకు యుద్ధంపై ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం

