Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lokesh Capgemini Meeting | క్యాప్​ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్​ భేటీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Lokesh Capgemini Meeting | క్యాప్​ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్​ భేటీ

ఆంధ్రప్రదేశ్​

Lokesh Capgemini Meeting | క్యాప్​ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్​ భేటీ

క్యాప్​ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్​ భేటీ అయ్యారు. విశాఖలో డెవలప్​మెంట్ సెంటర్​, జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 12:50 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Lokesh Capgemini Meeting

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lokesh Capgemini Meeting | క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ (Cap Gemini CEO Ayman Izzat)​తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో డెవలప్​మెంట్ సెంటర్​, జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు.

Contents
  • Lokesh Capgemini Meeting | వేగంగా అభివృద్ధి
    • Lokesh Capgemini Meeting | 20 వేల ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్​ (Andhra Pradesh)లో ఐటీ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా విశాఖను ఐటీ హబ్​గా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు డేటా సెంటర్లు, సంస్థల ఏర్పాటు కోసం ఆయా పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రులు సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా లోకేష్​ క్యాప్​ జెమినీ సీఈవోతో చర్చించారు.

Lokesh Capgemini Meeting | వేగంగా అభివృద్ధి

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో విశాఖపట్నం ఐటీ, డేటా సెంటర్ హబ్​గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని లోకేష్​ అన్నారు. దేశంలోనే అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖలో ల్యాండ్ అయ్యాయని చెప్పారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అవుతుందని చెప్పారు. దేశంలో మరే ప్రాంతంలోని లేని ఐటీ ఎకో సిస్టమ్ (IT Ecosystem) విశాఖపట్నానికి మాత్రమే సొంతం అని లోకేష్​ పేర్కొన్నారు.

Lokesh Capgemini Meeting

Lokesh Capgemini Meeting | 20 వేల ఉద్యోగాలు

అన్ని అనుకూలతలు ఉన్న వైజాగ్​లో 20వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్​సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కో డెవలప్​మెంట్ పార్టనర్​గా వ్యవహరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Eluru Child Tragedy | ఏలూరులో చోటు చేసుకున్న తీవ్ర విషాదం.. కూల్‌డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగి చిన్నారి మృతి

Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్
Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య
TTD Ghee Tanker Accident | టీటీడీకి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. 21 వేల లీటర్ల నెయ్యి తోడేసిన స్థానికులు
QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
TAGGED:Andhra PradeshCap Gemini CEO Ayman IzzatCM Chandrababu NaiduGoogle Data CenterIT EcosystemLokesh Capgemini Meeting
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gas Shortage Protests Gas Shortage Protests | గ్యాస్​ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన
Next Article Licensed Surveyors Wages Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?