అక్షరటుడే, వెబ్‌డెస్క్: Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై ఖమ్మం (Khammam)లోని భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పొంగులేటి మాట్లాడుతూ.. దేవుడు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని ఇచ్చాడన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులు చేయాలని సూచించారు.
Strengthening Gram Panchayats | భారీగా నిధులు
పంచాయతీల బలోపేతం కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అన్నారు. కొద్ది రోజుల్లోనే పంచాయతీల ఖాతాల్లోకి భారీగా నిధులు జమ చేశామని చెప్పారు. ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా, ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగించాలని ఆదేశించారు. నిధులకు ప్రజాప్రతినిధులు కాపలాదారులుగా ఉండి, చట్టపరిధిలో ప్రతి పైసాను గ్రామాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలన్నారు.
Strengthening Gram Panchayats | తాగునీటి సమస్యపై..
వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి. మురుగు నీరు రోడ్లపై నిల్వకుండా చర్యలు చేపట్టాలి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు

