అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Fall | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో క్రూడ్ ఆయిల్ (Crude oil) ధరలు మళ్లీ బ్యారెల్‌కు వంద డాలర్లకు చేరువయ్యాయి. మరోవైపు మన రూపాయి విలువ మరోసారి జీవన కాల కనిష్టాలను నమోదు చేసింది.
దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై (Stock Markets) కనిపించింది. భారత జెండాతో కూడిన చమురు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించిందన్న వార్తలతో మార్కెట్లు కాస్త తేరుకున్నా.. భారత్ సహా 16 దేశాలపై అదనపు సుంకాలను విధించడం కోసం ట్రంప్ సెక్షన్ 301ను ప్రయోగించనున్నారన్న వార్తలతో చివరి రెండు గంటల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సూచీలు మళ్లీ పతనమయ్యాయి.
Stock Market Fall | భారీ నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 494 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 498 పాయింట్లు క్షీణించింది. అక్కడినుంచి కాస్త కోలుకుని 810 పెరిగింది. నిఫ్టీ 192 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 118 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి కోలుకుని 277 పాయింట్లు పెరిగింది. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. చివరికి సెన్సెక్స్ 829 పాయింట్ల నష్టంతో 76,034 వద్ద, నిఫ్టీ 227 పాయింట్ల నష్టంతో 23,639 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Fall | రాణించిన యుటిలిటీ, పవర్ సెక్టార్లు..
యుటిలిటీ, పవర్, ఎనర్జీ సెక్టార్లు రాణించినా మిగతా ఇండెక్స్‌లు నష్టాల బాటలో సాగాయి. నిఫ్టీలో యుటిలిటీ ఇండెక్స్ 3.31 శాతం, పవర్ 2.51 శాతం, ఎనర్జీ 1.06 శాతం పెరిగాయి. ఆటో ఇండెక్స్ 3.19 శాతం, ఎఫ్ఎంసీజీ 1.77 శాతం, రియాలిటీ 1.63 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.14 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.01 శాతం నష్టపోయాయి.
Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,713 కంపెనీలు లాభపడగా 2,516 స్టాక్స్ నష్టపోయాయి. 175 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 68 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 378 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో, 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎన్టీపీసీ 2.79 శాతం, పవర్‌గ్రిడ్ 1.64 శాతం, టెక్ మహీంద్రా 1.61 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.71 శాతం, రిలయన్స్ 0.05 శాతం లాభపడ్డాయి.
Top losers : ఎంఅండ్ఎం 4.23 శాతం, మారుతి 3.60 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.31 శాతం, ఎల్‌టీ 3.06 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.90 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: March 12 Gold Prices | మళ్లీ ఎగబాకిన బంగారం ధర.. కిలో వెండి రూ.3 లక్షలకు చేరువలో!

