Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Petrol Gas Shortage India | దేశంలో పెట్రోల్​, గ్యాస్​ కొరత లేదు : కేంద్ర మంత్రి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Petrol Gas Shortage India | దేశంలో పెట్రోల్​, గ్యాస్​ కొరత లేదు : కేంద్ర మంత్రి

జాతీయం

Petrol Gas Shortage India | దేశంలో పెట్రోల్​, గ్యాస్​ కొరత లేదు : కేంద్ర మంత్రి

దేశంలో పెట్రోల్​, గ్యాస్​ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పార్లమెంట్​లో గురువారం ఆయన మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 6:34 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Petrol Gas Shortage India

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Petrol Gas Shortage India | దేశంలో పెట్రోల్​, గ్యాస్​ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) అన్నారు. పార్లమెంట్​లో గురువారం ఆయన మాట్లాడారు. గ్యాస్ ఉత్పత్తిని పెంచమని కంపెనీలను ఆదేశించినట్లు వెల్లడించారు. ఎల్​పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Contents
  • Petrol Gas Shortage India | మన నౌకలు సేఫ్​
    • Petrol Gas Shortage India | ఇతర మార్గాల ద్వారా..

గ్యాస్​ బుకింగ్‌లలో పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సరఫరా అంతరాయాలపై ప్రజల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పార్లమెంటులో ప్రకటన చేశారు. దేశీయ LPG ఉత్పత్తి పెరిగిందని, డెలివరీ సిస్టం ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని, అవసరానికి మించి గ్యాస్​ సిలిండర్లను నిల్వ చేయొద్దని కోరారు. హార్ముజ్ జలసంధికి సంబంధించిన దౌత్యపరమైన సున్నితత్వాల కారణంగా కొన్ని సరఫరా వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, అదనపు LPG సరఫరాలను పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి పురి తెలిపారు.

Petrol Gas Shortage India | మన నౌకలు సేఫ్​

హార్మూజ్‌ జలసంధి (Strait of Hormuz)లోని 28 భారత నౌకలు సేఫ్‌గా ఉన్నాయని మంత్రి తెలిపారు. గ్యాస్‌ సంక్షోభాన్ని నివారించడంలో రాష్ట్రాలే కీలకం అన్నారు. బ్లాక్‌ మార్కెట్‌ను రాష్ట్రాలే నిరోధించాలని సూచించారు. ప్రతిరోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామని తెలిపారు. హార్ముజ్​ నుంచి రవాణా నిలిచిపోవడంతో అనేక దేశాలపై ప్రభావం పడిందన్నారు. భారత్​పై సైతం ప్రభావం పడినా.. ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయని తెలిపారు. పొరుగున ఉన్న దేశం రెండు వారాల పాటు అన్ని పాఠశాలలను మూసివేసిందని ఆయన పేర్కొన్నారు. మరొక పొరుగు దేశం విశ్వవిద్యాలయాలను ముందుగానే మూసివేసిందన్నారు. భారత్​లో మాత్రం సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు.

Petrol Gas Shortage India | ఇతర మార్గాల ద్వారా..

భారతదేశ ముడి చమురు సరఫరా స్థానం సురక్షితంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. గతంలో దాదాపు 45 శాతం క్రూడ్​ ఆయిల్​ హార్ముజ్ మార్గం ద్వారా రవాణా అయ్యేదన్నారు. ప్రస్తుతం ఇతర మార్గాల ద్వారా 70 శాతానికి దిగుమతులు పెరిగాయని వెల్లడించారు. దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ATF లేదా ఇంధన చమురు కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

దీనిని కూడా చదవండి : India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..

IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు
Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
TAGGED:Hardeep Singh PuriHormuz Strait oil supplyindia fuel supplyLPG cylinder supplyoil and gas ministry Indiapetrol shortage India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article House Fire Accident | House Fire Accident | పెంకుటిల్లు దగ్ధం.. కాలి ముద్దయిన 20 తులాల బంగారం, వెండి.. భారీ ఆస్తినష్టం
Next Article ACB Bribery Arrest ACB Bribery Arrest | ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?