Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Subsidy Tractors Farmers | రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Subsidy Tractors Farmers | రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేత

తెలంగాణ

Subsidy Tractors Farmers | రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేత

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి రాజనర్సింహ తెలిపారు. పలువురు రైతులకు సబ్సిడీపై మినీ ట్రాక్టర్లు అందించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 7:44 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Subsidy Tractors Farmers

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Subsidy Tractors Farmers | రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం (Horticulture Mechanization Scheme) అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Contents
  • Subsidy Tractors Farmers | సాగు ఖర్చు తగ్గించుకోవాలి
    • Subsidy Tractors Farmers | పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ (Sangareddy Collectorate) ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను మంత్రి పంపిణీ చేశారు. ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కోటి రూ.4.9 లక్షల విలువ గల 20 హెచ్‌పీ కెపాసిటీ మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీతో అందజేశారు.

Subsidy Tractors Farmers | సాగు ఖర్చు తగ్గించుకోవాలి

వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి యాంత్రీకరణ ఎంతో అవసరమని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఆధునిక పద్ధతులు, యంత్రాలను వినియోగించి సాగు ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు, డీఆర్‌డీవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Subsidy Tractors Farmers | పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి

rajanarsihma 2

రాష్ట్రంలో వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (Digital Health Profile) వ్యవస్థను అమలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన, అమలుపై రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు అమలు విధానం, ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలపై చర్చించారు.

ఇది కూడా చదవండి : ACB Bribery Arrest | ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్

Harish Rao Criticism | ప్రజలను మోసం చేసేందుకే ‘99 రోజుల ప్రణాళిక’ : హరీశ్​రావు
KTR in Assembly | మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్: కేటీఆర్
Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్​ 1 నుంచి రెండో విడత
TAGGED:farmer subsidy tractorshorticulture mechanization schememini tractors distributionSangareddy farmers newsTelangana agriculture schemes
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Congress Leader Murder Case Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Next Article Public Representatives Training | Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?