Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి

నిజామాబాద్

Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి

తమకు సేవ చేస్తారని ఎంతో నమ్మకంతో ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి హితవు పలికారు. నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్​లో మేయర్​, డిప్యూటీ మేయర్​, మున్సిపల్​ ఛైర్మన్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 12, 2026 8:56 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Public Representatives Training |
Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి

అక్షరటుడే, ఇందూరు: Public Representatives Training | తమకు సేవ చేస్తారని ఎంతో నమ్మకంతో ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Ila Tripathi Collector) హితవు పలికారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో (Nizamabad Local Governance) భాగంగా నూతనంగా ఎన్నికైన మేయర్​, డిప్యూటీ మేయర్​, మున్సిపల్​ ఛైర్మన్లు, వైస్​ ఛైర్మన్లు, కౌన్సిలర్లకు గురువారం బోర్గాం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్​ హాల్​లో శిక్షణ కార్యక్రమం (Telangana Public Administration) నిర్వహించారు. అదే విధంగా అమృతా గార్డెన్స్​లో సర్పంచ్​లకు అవగాహన సదస్సు జరిగింది.

Contents
  • Public Representatives Training | విధులు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ..
  • Public Representatives Training | సేవ చేయాలనే సంకల్పం ఉండాలి

Public Representatives Training | విధులు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ..

ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ, ప్రింటెడ్ మెటీరియల్​ను ప్రజాప్రతినిధులకు (Municipal Leaders Training) అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. హక్కులు, అధికారాలతో పాటు బాధ్యతలను సైతం సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల సభ్యులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

Public Representatives Training | సేవ చేయాలనే సంకల్పం ఉండాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే ప్రగాఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో (Local Government Development) అందరిని భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చొరవ చూపాలన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో (Panchayat Representatives) సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఉందని సూచించారు. సదస్సులలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీపీవో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో సాయాగౌడ్, డీఈవో అశోక్, ఏవో రాజబాబు, బోధన్, ఆర్మూర్, భీమ్​గల్​ మున్సిపల్ ఛైర్​పర్సన్లు, వైస్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

meet2

ఇది కూడా చదవండి: Minor Child Labour | కళాశాలలో మైనర్​ పనిచేస్తుండడంపై కలెక్టర్​ ఆగ్రహం.. ప్రిన్సిపాల్​కు షోకాజ్ నోటీసులు

Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్​ విశాల్
Indur Tirumala Brahmotsavam | ఇందూరు తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
Kamarreddy District Court | స్నేహితుడి హత్య కేసులో అన్నదమ్ములకు జీవిత ఖైదు
Six Guarantees Legal Status | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
Kamareddy Father Remanded | ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్
TAGGED:Ila Tripathi CollectorLocal Government DevelopmentMunicipal Leaders TrainingNizamabad Local GovernancePanchayat RepresentativesPraja Palana Pragathi Planpublic representatives trainingTelangana Public Administration
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Subsidy Tractors Farmers Subsidy Tractors Farmers | రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేత
Next Article Iran Warns US Iran Warns US | అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?