అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran Warns US | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. గల్ఫ్‌లో యూఎస్ (US) సైనిక స్థావరాలు తొలగించకుంటే దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఆయన తన మొదటి ప్రకటన విడుదల చేశారు. హార్ముజ్ జలసంధి మూసివేతతో లభించే ప్రయోజనాలను ఇరాన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Iran Warns US | ప్రతీకారం తీర్చుకుంటాం
హార్ముజ్ స్థావరాలు దాడిని ఎదుర్కొంటాయని, వాషింగ్టన్ భద్రతా హామీలను అబద్ధం తప్ప మరేమీ కాదని ఖమేని తోసిపుచ్చారు. శత్రువులపై వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా హార్ముజ్ జలసంధిని మూసివేయాలని పిలుపునిచ్చారు. యుద్ధంతో మరణాలకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. ఇరాన్ తన ప్రత్యర్థుల నుంచి నష్టపరిహారం కోరుతుందని, అవి జరగకపోతే వారి ఆర్థిక లేదా సైనిక ప్రయోజనాలను దెబ్బతీయడం ద్వారా ప్రతిస్పందిస్తుందని ఖమేనీ హెచ్చరించారు.
Iran Warns US | ఆ స్థావరాలపైనే..
పొరుగు దేశాలతో తాము స్నేహం కోరుకుంటామని ఖమేనీ అన్నారు. అయితే ఆయా దేశాల్లోని అమెరికన్ స్థావరాలపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అమెరికన్ స్థావరాలను మూసి వేయాలని ఆ దేశాలకు సూచించారు. యుద్ధం వల్ల నష్టపోయిన ఇరాన్ (Iran) ప్రజలకు పరిహారం ఇస్తామని ప్రకటించారు.
దీనిని కూడా చదవండి : Iran War Ceasefire | యుద్ధం ఆపేస్తాం.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన

