అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flying Academy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు (Kamareddy Development) తీసుకురావడానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (K Venkata Ramana Reddy MLA) తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డికి రింగ్‌రోడ్డు, ఆర్వోబీ నిర్మాణాలు, రైల్వే అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను కోరారు.
Kamareddy Flying Academy | కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని..
తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును (Ram Mohan Naidu Aviation Minister) ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఒక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి పట్టణం రాష్ట్ర రాజధానికి అతి తక్కువ దూరంలో (Telangana Infrastructure) ఉందని, జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉన్నాయన్నారు. కామారెడ్డిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఫ్లయింగ్ అకాడమీ (Kamareddy Flying Academy) ఏర్పాటు చేస్తే కామారెడ్డి అభివృద్ధి చెందటమే కాకుండా పైలెట్ శిక్షణ ఉంటే యువతకి కూడా (Youth Employment Opportunities) ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని మంత్రికి వివరించినట్టు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాలను తెలుసుకుంటామని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు

