అక్షరటుడే, ఇందూరు: Fee Poru Deeksha | ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ను (Fee Reimbursement Protest) విడుదల చేయకపోవడంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం ఏర్పడుతుందని(Nizamabad) బీసీ సంక్షేమ సంఘం ( BC Welfare Association) జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం ‘ఫీజు పోరు దీక్ష’ పోస్టర్లను ఆవిష్కరించారు.
Fee Poru Deeksha | స్కాలర్‌షిప్‌ల సాధనే ధ్యేయంగా..
పోస్టర్ల ఆవిష్కరణ అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ.. సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు (Indira Park Dharna) దీక్ష చేపడుతున్నామన్నారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15న ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ (Hyderabad Protest News) వద్ద ధర్నాచౌక్‌లో ఫీజు పోరు దీక్షకు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు హాజరుకావాలని కోరారు.
Fee Poru Deeksha | పేదలకు కావాల్సింది ఉచిత విద్య..
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ… పేదలకు కావాల్సింది ముఖ్యంగా ఉచిత విద్య, మరియు ఉచిత వైద్యం అని అన్నారు. ఈ రెండు ప్రజలకు చేరితే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు కాబట్టి వారికి ఏ ఇతర సహాయం అవసరముండదన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే (Telangana Education Protest) ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ డబ్బులను విడుదల చేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, సాయి బసవ, బగ్గలి అజయ్, రేఖ, కోడూరు స్వామి, సురేందర్, శ్రీకాంత్, రుక్మిణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Minor Child Labour | కళాశాలలో మైనర్ పనిచేస్తుండడంపై కలెక్టర్ ఆగ్రహం.. ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసులు

