Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​

అంతర్జాతీయంజాతీయంతాజా వార్తలు

Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​

మధ్యప్రాచ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన మార్కెట్లు, భద్రతపై ప్రభావం చూపుతోంది. మొత్తంగా గ్లోబల్ సంక్షోభంగా మారుతోంది. పరిస్థితి మరింత విషమిస్తే చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 13, 2026 12:07 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
Iran Israel War live updates
Iran Israel War live updates

అక్షరటుడే, న్యూఢిల్లీ: Iran Israel War live updates | పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా–ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఈ దేశాల మధ్య యుద్ధం మొదలయ్యాక.. భారత ప్రధాని Narendra Modi నరేంద్ర మోడీ తొలిసారి గురువారం (మార్చి 12) రాత్రి  ఇరాన్ అధ్యక్షుడు Masoud Pezeshkian తో ఫోన్‌లో మాట్లాడారు.

Contents
  • Iran Israel War live updates | హోర్ముజ్ జలసంధే ఇరాన్​ ఆయుధం
    • Iran Israel War live updates | 100 డాలర్లు దాటిన క్రూడ్​ ఆయిల్​ ధర
      • యుద్ధం ఎలా ప్రారంభమైందంటే..
      • లెబనాన్‌లో ఉద్రిక్తత
      • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
      • దౌత్యపరమైన ప్రయత్నాలు

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండేందుకు దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​

Iran Israel War live updates | హోర్ముజ్ జలసంధే ఇరాన్​ ఆయుధం

ఇక, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ Mojtaba Khamenei యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి అధికారికంగా ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచానికి కీలక చమురు రవాణా మార్గమైన Strait of Hormuz ను ఒత్తిడి సాధనంగా మార్చుకుంటామని హెచ్చరించారు. గల్ఫ్​లో అమెరికా ప్రాంతీయ సైనిక స్థావరాలు మూసివేయకపోతే వాటిపై దాడులు నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు.

Iran Israel War live updates | 100 డాలర్లు దాటిన క్రూడ్​ ఆయిల్​ ధర

ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో హోర్ముజ్ జలసంధి ద్వారానే దాదాపు 20 శాతం రవాణా అవుతోంది. ఇక్కడ రవాణాకు అంతరాయం ఏర్పడటంతో బ్యారెల్‌ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లు దాటింది.

యుద్ధం ఎలా ప్రారంభమైందంటే..

అమెరికా–ఇజ్రాయెల్ దేశాలు ఫిబ్రవరి 28న సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ Ali Khamenei చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతిగా డ్రోన్లు, క్షిపణులతో అమెరికా మిత్ర దేశాలపై అప్పటి నుంచి నిరంతరంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది.

లెబనాన్‌లో ఉద్రిక్తత

యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా – ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌ దేశంలోని పలు ప్రాంతాలపై వేలాది సైనిక దాడులు జరిపినట్లు సమాచారం. ఇదే సమయంలో లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించడం వల్ల ప్రాంతీయంగా మరింత ఉద్రిక్తత పెరిగింది. లక్షలాది జనాలు తమ నివాసాలను వదిలి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం

గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై దాడులు జరగడం, చమురు రవాణా నిలిచిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర అస్థిరత కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

దౌత్యపరమైన ప్రయత్నాలు

ఈ నేపథ్యంలో యుద్ధం ఆపాలని భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాలు పిలుపునిస్తున్నాయి. ప్రధాని మోడీ కూడా ఇరాన్​ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడారు. శాంతి, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం సాధ్యమని ఇరాన్ కు సూచించారు.

IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
Paralysis Warning Signs | పక్షవాతం.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే!
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Chaitra Amavasya | కొత్త అమావాస్య.. పితృదేవతల ఆశీస్సుల కోసం ఉగాదికి ఒకరోజు ముందే చేసే పండగ!
Kabul Airstrike 400 Killed | కాబూల్‌లో ఘోర వైమానిక దాడి.. 400 మంది మృతి అంటూ తాలిబన్ ఆరోపణలు, పాకిస్థాన్ ఖండన
TAGGED:geopolitical crisis 2026global oil prices surgeIran Israel warmiddle east conflict 2026pm modi iran callStrait of Hormuz crisisus israel iran tensionsworld news middle eastఇరాన్ అధ్యక్షుడు Masoud Pezeshkian
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ
Next Article March 13 Horoscope | స్పెక్యులేషన్ల ద్వారా ఈ రాశుల వారికి జాక్‌పాట్ తగిలే ఛాన్స్! March 13 Horoscope | స్పెక్యులేషన్ల ద్వారా ఈ రాశుల వారికి జాక్‌పాట్ తగిలే ఛాన్స్!
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?