అక్షరటుడే, వెబ్డెస్క్: Road Accident on NH44 | జాతీయ రహదారి 44పై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలో ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Road Accident on NH44 | గన్నారం శివారులో..
వివరాల్లోకి వెళ్తే.. 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం గన్నారం శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలోని అకోలాకు వెళ్తుండగా బస్సు గన్నారం శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందల్వాయి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Congress Leader Murder | నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య!

