అక్షరటుడే, ఇందూరు: Nizamabad Bus Accident | నిజామాబాద్ Nizamabad జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామ శివారులో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రహ్మంగారి ఆలయం సమీపంలో జాతీయ రహదారి 44పై వేగంగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
Nizamabad Bus Accident | నలుగురు అక్కడికక్కడే మృతి
బస్సు బోల్తా పడటంతో నలుగురు ప్రయాణికులు Passengers తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అక్కడి ప్రయాణికులు కలిసి బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Nizamabad Bus Accident | ముమ్మర దర్యాప్తు..
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు Police వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ బృందాలు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించాయి. అనంతరం రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగం లేదా వాహనంలో సాంకేతిక లోపం వంటి కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Road Accident on NH44 | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురి దుర్మరణం

