Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ

బిజినెస్​తాజా వార్తలు

TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ

ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది. భారత మార్కెట్‌లో ఆర్బిటర్ వీ1 మోడల్‌ను విడుదల చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 13, 2026 9:35 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
TVS Orbiter V1

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TVS Orbiter V1 | టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తన విద్యుత్ ద్విచక్ర వాహన శ్రేణిని మరింత విస్తరించింది. గతేడాది ఆర్బిటర్ పేరిట స్కూటర్‌ను లాంచ్ చేసిన కంపెనీ.. తాజాగా ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసింది. ఇది 1.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. వీ2 మోడల్ 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. అర్బన్ రైడర్స్ కోసం ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

Contents
  • TVS Orbiter V1 | బాస్ పద్ధతిలో..
    • TVS Orbiter V1 | రేంజ్, ఫీచర్స్..

TVS Orbiter V1 | బాస్ పద్ధతిలో..

వినియోగదారులకు అందుబాటు ధరలో స్కూటర్‌ను అందించడంలో భాగంగా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (బాస్) నమూనాతో ఈ మోడళ్లను అందిస్తోంది. బాస్ మోడల్‌లో వాహన ధర నుంచి బ్యాటరీ ధర తగ్గుతుంది. అంటే పూర్తి బ్యాటరీ ధరను ముందస్తుగా చెల్లించకుండా, బ్యాటరీ వినియోగం ఆధారంగా నెలవారీగా చెల్లించే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ఆర్బిటర్ వీ1 మోడల్ స్కూటర్ రూ.49,999 కే (దిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర) అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ధరలు నెలకు రూ. 862 నుంచి ప్రారంభమవుతాయి. బాస్‌ను వినియోగించుకోని వినియోగదారులు రూ.84,500(బ్యాటరీతో సహా) చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బిటర్ వీ2 మోడల్ ధర రూ.99,900గా నిర్ణయించారు.

TVS Orbiter V1 | రేంజ్, ఫీచర్స్..

టీవీఎస్ ఆర్బిటర్ వీ1 ఐడీసీ రేంజ్ 86 కిలోమీటర్లు కాగా.. ఆర్బిటర్ వీ2 158 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. రెండింట్లోనూ 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీ ఉంది.

5.5 అంగుళాల ఎల్‌సీడీ క్లస్టర్ ఉంది. టీవీఎస్ స్మార్ట్ (TVS Smart) కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి సదుపాయాలు పొందొచ్చు.

ఇది కూడా చదవండి..: March 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!

Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ
Iran Gulf Attacks | గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం
Kukatpally Cash Robbery | కళ్లలో కారం చల్లి.. రూ.21 కోట్లు ఎత్తుకెళ్లారు
TAGGED:budget electric scooterelectric scooter IndiaEV news IndiaEV scooter launchTVS electric scooterTVS Motor CompanyTVS Orbiter V1TVS Orbiter V2VS Motor Company
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Furniture Mall Fire Hyderabad Furniture Mall Fire | హైదరాబాద్‌లో అర్ధ‌రాత్రి భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ మాల్ దగ్ధం, కోట్ల రూపాయల నష్టం
Next Article PM Kisan 22nd Installment PM Kisan 22nd Installment | నేడు పీఎం కిసాన్​ నిధుల విడుదల
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?