అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajampet Husband Arrested | కడప జిల్లా (Kadapa District) రాజంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుంటే.. ఆపాల్సిన భర్త.. దగ్గరుండి వీడియో తీశాడు. అంతేగాకుండా అలా కాదు… ఇలా ఉరి వేసుకోవాలని ఆమెకు చెప్పాడు.
క్షణికావేశంలో భార్య ఆత్మహత్యకు యత్నిస్తే అడ్డుకోవాల్సిన భర్త.. నవ్వుతూ శాడిజం చూపాడు. రాజంపేట మండలం (Rajampet Mandal) బోయినపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ లోకోపైలెట్‌గా పని చేస్తున్నాడు. అతడికి కృష్ణవేణి అనే యువతితో వివాహం అయింది. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం మరోసారి దంపతులు గొడవ పడ్డారు. దీంతో భార్య కృష్ణవేణి తాను ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది.
Rajampet Husband Arrested | కిటీకిలోంచి వీడియో..
కృష్ణవేణి గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. అనంతరం ఉరి వేసుకుంది. అయితే ఆమె ఉరి వేసుకునే సమయంలో భర్త శ్రీనివాస్ కిటికీలో నుంచి ఆమెను వీడియో తీశాడు. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నవ్వుతూ వీడియో చిత్రీకరించారు. ఇలా ఉరి వేసుకోవాలంటూ ఆమె సూచనలు చేశాడు సైకో భర్త.
Rajampet Husband Arrested | నిందితుడి అరెస్ట్
కృష్ణవేణి మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె ఉరి వేసుకుంటే.. అడ్డుకోకుండా వీడియో తీసిన శ్రీనివాస్‌పై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Lokesh Capgemini Meeting | క్యాప్ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ
