అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Car Fire | రన్నింగ్ కారులో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని లింగాపూర్ శివారులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
Kamareddy Car Fire | లింగాపూర్ గ్రామానికి చెందిన..
పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి (Lingapur Village) చెందిన అనిల్ గ్రామం నుంచి కామారెడ్డి వైపు వెళ్తుండగా ఒక్కసారిగా కారులోంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఆ వెంటనే మంటలు వ్యాపించడాన్ని గమనించిన అనిల్ వెంటనే అప్రమత్తమై కారులో నుంచి బయటకు దూకేశాడు. దాంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో అంటుకున్న కారు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన అనిల్ ఫైర్ ఇంజన్ అధికారులకు, పోలీసులకు సమాచారం చేరవేశాడు. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ అధికారులు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఘటన స్థలానికి కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) చేరుకొని విచారణ చేపట్టారు. దగ్ధమైన కారు లింగాపూర్ గ్రామానికి చెందిన బందెల రాజుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి..: Operation Kavach Inspections | అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

