అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Girls Missing | పట్టణంలో అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇటీవల ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమై కన్నతండ్రే చెరువులో తోసి హతమార్చిన ఘటన మరువక ముందే బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం ఘటన సర్వత్రి చర్చనీయాంశమైంది.
Kamareddy Girls Missing | కామారెడ్డి పట్టణంలోని..
కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ సమీపంలో ఉన్న బాలసదనంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సదరు బాలికలు బాలసదనం నుంచి వెళ్లిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. నిరంతరం పర్యవేక్షణ కొరవడటంతోనే బాలికలు అదృశ్యమైన్నట్టుగా సమాచారం. అయితే సదరు బాలికలు చదువుకుంటున్నారా.. లేక బయట పని చేసుకునే పిల్లలా అనేది తెలియరాలేదు. గతంలో ఇలాంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరించినా మార్పు రావడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయమై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. అయితే బాలికల అదృశ్యం విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా బాలికల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం.
Kamareddy Girls Missing | ప్రహరీ దూకి పారిపోయారు
– సంగమేశ్వరి, బాలసదనం సూపరింటెండెంట్
ఇద్దరమ్మాయిలు బాలసదనం గోడ దూకి పారిపోయిన విషయం నిజమే. అయితే మూడు రోజుల క్రితం కాంపౌండ్ వాల్ కూల్చేయడం జరిగింది. పక్క ఇంటి వాళ్లు కడతామని చెప్పారు. అడ్డుగా రేకు ఏర్పాటు చేశారు. అయితే ఇద్దరిని హైదరాబాద్ (Hyderabad)లోని తరుణికి పంపిస్తారని తెలిసి భయంతో పారిపోయి ఉంటారు. బాలసదనం వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Car Fire | రన్నింగ్ కారులో మంటలు.. కామారెడ్డి శివారులో ఘటన

