అక్షరటుడే, కామారెడ్డి: Highway Dhaba Inspections | జాతీయ రహదారిపై ఉన్న దాబాలను తనిఖీ చేసి అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు.
Highway Dhaba Inspections | దాబా హోటళ్లపై దృష్టి పెట్టాలి..
ఈ సందర్భంగా అధికారులు నేషనల్ హైవే (National Highway) పై ఉన్న దాబా హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. హైవేపై ఉన్న అన్ని దాబా హోటళ్లకు పంచాయతీ కార్యదర్శులు నోటీసులు జారీ చేసి, వారికి సంబంధిత లైసెన్సులు ఉన్నాయా లేదా, నేషనల్ హైవే అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రయాణికులు, ప్రజలు నేషనల్ హైవేపై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, ఫుడ్ వేస్టేజ్, పేపర్ వేస్టేజ్ వంటి చెత్తను వేయకుండా రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా గ్రామపంచాయతీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హోటళ్ల నుంచి వచ్చే చెత్తను రోడ్డుపై వేస్తే సంబంధిత గ్రామపంచాయతీలు అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని కలెక్టర్ ఆదేశించారు.

Highway Dhaba Inspections | టేక్రియాల్ చెరువు వద్ద..
అంతకుముందు టేక్రియాల్ చెరువు వద్ద నిర్వహిస్తున్న శానిటేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సదాశివనగర్ (Sadasivanagar), కుప్రియల్ హైవే ఇరుపక్కల జరుగుతున్న శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. టెక్రియాల్ చెరువులో గణేష్, దుర్గాదేవి నిమజ్జనం జరిగిన ప్రదేశాల్లో, చెరువు పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు చెరువు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, శానిటేషన్ పనులు పూర్తిచేసి సాయంత్రం లోపు ఆ ప్రాంతాన్ని లెవల్ చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో మురళీ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, డీఎల్పీవో శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Girls Missing | బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం.. కామారెడ్డిలో ఘటన

