Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు

తెలంగాణతాజా వార్తలు

Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు

మూసీ ప్రాజెక్ట్ పేరుతో హైదరాబాద్​లో 10,017ఇళ్లు కూల్చబోతున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. డీపీఆర్​ సిద్ధం కాకముందే ప్రజలకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 13, 2026 2:08 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Musi Project Houses

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Musi Project Houses | మూసీ ప్రాజెక్ట్ పేరుతో హైదరాబాద్​ నగరంలోని 10,017ఇళ్లు కూల్చబోతున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ భవన్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Contents
  • Musi Project Houses | డీపీఆర్​ సిద్ధమైందా…
    • Musi Project Houses | వారికి ఏం ఇచ్చారు

మూసీ ప్రాజెక్ట్తో లక్షలాది మంది రోడ్డున పడతారని హరీశ్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నదిని శుభ్రం చేయడానికి అన్ని ఇళ్లూ కూల్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇరాన్‌లో మిస్సైల్స్ వల్ల ఇళ్లు కూలుతుంటే..ఇక్కడ బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సిద్ధం అయ్యారని ఆరోపించారు. ఈ బుల్డోజర్ రాజ్‌పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

Musi Project Houses | డీపీఆర్​ సిద్ధమైందా…

అసలు మూసీ ప్రాజెక్ట్‌కు డీపీఆర్ సిద్ధమైందా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. బాపూఘాట్‌ నుంచి హిమాయత్ సాగర్ వరకు డీపీఆర్ కోసం.. 18 నెలల సమయం పడుతుందని అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అప్పుడే పేదల ఇళ్లు కూల్చేందుకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మూసీ– గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం సామాన్య ప్రజల ఇండ్లు, భూములు గుంజుకుంటూ వాళ్ల మధ్యన చర్చ పెట్టకుండా 5 స్టార్ హోటల్ తాజ్ కృష్ణ (Hotel Taj Krishna)లో ప్రెజెంటేషన్ పెడతా అంటున్నారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Musi Project Houses | వారికి ఏం ఇచ్చారు

మూసీ ప్రాజెక్టు (Musi Project)లో ఇప్పటికే 300 ఇళ్లు కూల్చారని హరీశ్​రావు అన్నారు. ఆ బాధితులకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ (KCR) కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వారిని పంపించి మమ అనిపించారన్నారు. 2013 చట్టం ప్రకారం అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ, అమ్ముకునే శాశ్వత హక్కుతో కూడిన ఇల్లు కట్టించి, కుటుంబానికి దాదాపు రూ.15 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కానీ రేవంత్ రెడ్డి 300 మందిని మూడు దిక్కులా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోకి పంపించారని విమర్శించారు.

మూసీ ప్రాజెక్ట్​లో కూలిపోనున్న మధు రిడ్జ్​ అపార్ట్​మెంట్ వాసులకు మరో అపార్ట్​మెంట్ కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై హరీశ్​రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క మధు రిడ్జ్​ అపార్ట్​మెంట్ వాసులకు మాత్రమే కట్టిస్తారా.. ఇళ్లు కోల్పోతున్న 10 వేల మందికి కట్టిస్తారా అనేది చెప్పాలన్నారు. ముందు ఇళ్లు కట్టించాక కూల్చేస్తారా.. కూల్చిన తర్వాత కట్టిస్తారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ముందే ఇళ్లు కూల్చివేస్తే బాధితులు ఎక్కడ ఉండాలని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: Gas Cylinder Shortage | గ్యాస్​ కొరత.. ఏజెన్సీల వద్ద ప్రజల బారులు

March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!
Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Today Horoscope | గుండెలను కొల్లగొట్టే అయస్కాంతతత్వం ఈ రాశుల వారికే సొంతం!
Fake ginger garlic paste | టాస్క్​ఫోర్స్ దాడులు.. భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
TAGGED:CM Revanth ReddyHarish RaoHotel Taj KrishnaKCRMusi ProjectMusi Project HousesRahul Gandhi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article LPG Supply Review LPG Supply Review | గ్యాస్ కొరత లేకుండా చర్యలు : సీఎస్​
Next Article IVF Services Praised IVF Services Praised | ఐవీఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?