అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Development Works | గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరగాలంటే సర్పంచ్ల నుంచి మండల నాయకుల వరకు అందరూ సమన్వయంగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో (Jukkal Mandal) ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Yellareddy Development Works | ఎస్సీ, ఎస్టీ, బీసీ రంగాల అభివృద్ధికి నిధులు..
రానున్న రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ రంగాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని ఎమ్మెల్యే (MLA Thota Lakshmikantharao) పేర్కొన్నారు. అనంతరం ఆయన మండల కేంద్రంలో, గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తదుపరి పెద్దగుల్ల గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Industrial Corridor | కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కేవీఆర్ వినతి

