అక్షరటుడే, లింగంపేట: Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో (government hospitals) పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో రవీందర్ గౌడ్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నార్మల్ డెలివరీలు పెంచాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం లింగంపేట (lingampet phc) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్యశిబిరం (mega medical camp) నిర్వహించారు.
Government Hospital Punctuality | వైద్యసిబ్బందికి సూచనలు సలహాలు..
వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్వో రవీందర్ గౌడ్ (public health services) హాజరై సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య పరీక్షలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజల వైద్యానికి పెద్దపీట వేస్తుందని, సిబ్బంది సమయపాలన పాటించి వారికి వైద్య సేవలు అందించాలని సూచించారు.
Government Hospital Punctuality |207 మందికి వైద్య పరీక్షలు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా 27 మందికి వైద్య పరీక్షలు (healthcare awareness) నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (CM revanth reddy) ఆకాంక్ష అని డీఎంహెచ్వో వివరించారు. ఆస్పత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి హిమబిందు, సీహెచ్వోలు ఠాగూర్, గోవింద్ రెడ్డి, రమేష్, సర్పంచ్ కౌడ రవి, ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy Industrial Corridor | కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కేవీఆర్ వినతి

