Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gas Cylinders | గ్యాస్​ సిలిండర్ల కొరత లేదు.. ఆందోళన చెందవద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Gas Cylinders | గ్యాస్​ సిలిండర్ల కొరత లేదు.. ఆందోళన చెందవద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Gas Cylinders | గ్యాస్​ సిలిండర్ల కొరత లేదు.. ఆందోళన చెందవద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని నిజామాబాద్​ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ మేరకు అధికారులతో సమావేశం నిర్వహించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 13, 2026 5:49 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Gas Cylinders

అక్షరటుడే, ఇందూరు: Gas Cylinders | వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా కలెక్టరేట్​లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని.. 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని తెలిపారు. శుక్రవారం నాటికి 1,00,850 సిలిండర్లు జిల్లాలో గృహ అవసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయన్నారు. వీటికి అదనంగా మరో 585 సిలిండర్లు జిల్లాకు రానున్నాయని చెప్పారు. సిలిండర్ బుక్ చేసిన వారికి మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

Contents
  • Gas Cylinders | బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తే కఠిన చర్యలు
    • Gas Cylinders | ఏజెన్సీలకు వెళ్లాల్సిన అవసరం లేదు

Gas Cylinders | బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తే కఠిన చర్యలు

ఎవరైనా గ్యాస్​ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి.. బ్లాక్ మార్కెట్​లో విక్రయిస్తే నిత్యవసరాల సరుకుల చట్టం 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ హెచ్చరించారు. ఇప్పటికే తనిఖీలను ముమ్మరం చేయించామని తెలిపారు. మార్చిలో ఎన్​ఫోర్స్​మెంట్​ బృందాలు ఆకస్మిక దాడులు జరిపిన సందర్భంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 156 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసును నమోదు చేశామన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు ఆస్పత్రులు, అంగన్​వాడీ కేంద్రాలు, అనాథ ఆశ్రమాలకు ఇండెంట్లు అందిన వెంటనే సిలిండర్లు సరఫరా చేయాలని ఏజెన్సీల నిర్వాహకులకు సూచించారు.

Gas Cylinders

Gas Cylinders | ఏజెన్సీలకు వెళ్లాల్సిన అవసరం లేదు

వినియోగదారులు ఆన్​లైన్​లో సిలిండర్లను బుక్ చేసుకోవాలని కలెక్టర్​ సూచించారు. ఏజెన్సీలు, గ్యాస్ గోదాముల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం సింగిల్ సిలిండర్​కు 25 రోజులు, డబుల్ సిలిండర్​కు 45 రోజుల వ్యవధి తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఏఎస్​వో అరవింద్ రెడ్డి, డీటీవో ఉమామహేశ్వరరావు, డీపీవో శ్రీనివాసరావు, డీడబ్ల్యూవో పద్మ, గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి.. మంత్రి కోమటిరెడ్డికి ఎంపీ అర్వింద్​ లేఖ

Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన
RSS Role Hindu Society | హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం : ఎమ్మెల్యే ధన్​పాల్
ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం
Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!
Telangana Education Commission | విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అశాస్త్రీయం..: టీపీటీఫ్​
TAGGED:domestic gas supplyGas Cylinder ShortageIla Tripathi Collectorindia gas supply newslpg black market warninglpg cylinder booking ruleslpg supply nizamabadNizamabad District News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Watermelon Health Benefits | పుచ్చకాయను ఇష్టంగా తింటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! Watermelon Health Benefits | పుచ్చకాయను ఇష్టంగా తింటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Next Article Government Hospital Punctuality | Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి : డీఎంహెచ్​వో
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?