అక్షరటుడే, వెబ్‌డెస్క్ : H J Dora Death | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పని చేసిన హెచ్‌జె దొర (83) మృతి చెందారు. కొంతకాలంగా ఆయన కిడ్ని సమస్యలతో బాధ పడుతున్నారు. శుక్రవారం నిమ్స్ ఆస్పత్రి (Nims Hospital)లో డయాలసిస్ చేయించుకొని ఇంటికి వెళ్లారు. అనంతరం బాత్రూమ్లో పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు.
హెచ్‌జె దొర (HJ Dora) ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీ (DGP)గా సేవలందించారు. 1943లో శ్రీకాకుళంలో జన్మించిన ఆయన 1965 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. 1996 నుంచి 2002 వరకు ఉమ్మడి ఏపీ డీజీపీగా సేవలు అందించారు. ఆ సమయంలో నక్సలైట్లను అణిచి వేయడంలో కీలకంగా వ్యవహరించారు.
H J Dora Death | సీఎం సంతాపం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాజీ డీజీపీ మరణంపై సంతాపం తెలిపారు. దొర కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారని, పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ముఖ్యమంత్రి తెలిపారు.
H J Dora Death | ఏపీ సీఎం దిగ్భ్రాంతి
మాజీ డీజీపీ దొర మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ పోలీస్‌కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. నక్సల్ సమస్య పరిష్కారంలో హెచ్ జె దొర ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారని కొనియాడారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ సైతం ఆయన మృతిపై సంతాపం తెలిపారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో ఆయన డీజీపీగా పని చేశారన్నారు.
దీనిని కూడా చదవండి : Telangana LPG Supply | రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు.. బ్లాక్ మార్కెట్ తరలిస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్

