అక్షరటుడే, వెబ్‌డెస్క్: Deepa Aradhana Significance | భారతీయ సంస్కృతిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా, ముందుగా దీపం వెలిగించడం మనందరికీ అలవాటు. అది ఒక ప్రారంభోత్సవం కావచ్చు లేదా ఇంట్లో నిత్యం చేసే పూజ కావచ్చు, జ్యోతి ప్రజ్వలనతోనే అన్నీ మొదలవుతాయి.
అసలు దీపం వెలిగించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక మర్మం ఏమిటి? ఇది కేవలం వెలుగు కోసమేనా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ, మతపరమైన కారణాలు ఉన్నాయా? ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్న ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Deepa Aradhana Significance | జ్ఞానానికి, పురోగతికి ప్రతీక:
హిందూ సంప్రదాయంలో దీపాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా, విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు. “దీపజ్యోతి పరబ్రహ్మ..” అనే శ్లోకం ప్రకారం, దీపం మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది.
దీపం జ్వాల ఎప్పుడూ పైకే చూస్తుంది. ఇది మనిషి జీవితంలో సాధించాల్సిన ఉన్నతిని, అభివృద్ధిని, నిరంతర ఎదుగుదలను సూచిస్తుంది. మనం చేసే ప్రార్థనలు అగ్ని ద్వారా దైవానికి చేరుతాయని మన పెద్దల నమ్మకం.
Deepa Aradhana Significance | ప్రతికూలతను తరిమికొట్టే శక్తి:
దీపం వెలిగించడం వల్ల కేవలం చీకటి మాత్రమే పోదు.. మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తి) కూడా తొలగిపోతుంది. దీపం వెలుగు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపి, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
పంచ భూతాలలో ఒకటైన అగ్ని దేవుడు సూర్యుడికి ప్రతిరూపం. అందుకే ఏదైనా వేడుక మొదలుపెట్టే ముందు అగ్ని సాక్షిగా దీపాన్ని వెలిగించి, ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని దేవుడి ఆశీస్సులు కోరుకుంటాం.
వ్యాపారులు, రైతుల కోసం సూచనలు:
జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వ్యాపారం చిన్నదైనా, పెద్దదైనా తొలిసారి పని ప్రారంభించేటప్పుడు దీపం వెలిగించడం వల్ల ఆ ప్రాంతంలోని ఎనిమిది దిశల నుంచి దుష్ట శక్తులు పారిపోయి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
ఇక రైతులు కూడా తమ పొలాల్లో విత్తనాలు నాటే ముందు భూతల్లిని స్మరిస్తూ రెండు దీపాలు వెలిగిస్తే, పంటలు సమృద్ధిగా పండుతాయని శాస్త్రం చెబుతోంది.
ఇది కూడా చదవండి: Palmistry Y Sign | అరచేతిలో ఈ గుర్తు ఉందా.. అయితే కోటీశ్వరులయ్యే జాతకం!

