అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lebanon Children Killed | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా Lebanon పై Israel చేపడుతున్న వైమానిక దాడులు తీవ్ర ప్రాణ నష్టానికి దారితీస్తున్నాయి. ఈ మేరకు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం.. ఇటీవల జరిగిన దాడుల్లో 100 మందికి పైగా చిన్నారులు మరణించినట్లు సమాచారం.
Lebanon Children Killed | నిరంతరం వైమానిక దాడులు
లెబనాన్‌లోని నగరాలు, గ్రామాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు – డ్రోన్ల ద్వారా వరుస దాడులు కొనసాగుతున్నాయి. దీనివల్ల ముఖ్యంగా దక్షిణ లెబనాన్,సరిహద్దు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు నివాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. వందలాది కుటుంబాలు ఇళ్లు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Lebanon Children Killed | నిండిపోతున్న ఆసుపత్రులు
వరుస దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీంతో వల్ల వైద్య సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ఇప్పటికే ఆసుపత్రుల్లో పడకలు సరిపోవడం లేదు. దీంతో అత్యవసర చికిత్స కోసం తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయంగా ఆందోళన
యుద్ధంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని మానవతా సంస్థలు పిలుపునిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, మహిళలు అసువులు బాయడం ప్రపంచాన్ని కలచివేస్తోంది.

