Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Judiciary Corruption Chapter | 8వ తరగతిలో “న్యాయవ్యవస్థలో అవినీతి” పాఠ్యాంశం.. ఎన్​సీఈఆర్టీపై సుప్రీంకోర్టు మండిపాటు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Judiciary Corruption Chapter | 8వ తరగతిలో “న్యాయవ్యవస్థలో అవినీతి” పాఠ్యాంశం.. ఎన్​సీఈఆర్టీపై సుప్రీంకోర్టు మండిపాటు

జాతీయంతాజా వార్తలు

Judiciary Corruption Chapter | 8వ తరగతిలో “న్యాయవ్యవస్థలో అవినీతి” పాఠ్యాంశం.. ఎన్​సీఈఆర్టీపై సుప్రీంకోర్టు మండిపాటు

సుప్రీంకోర్టు తాజా ఆదేశం న్యాయ వ్యవస్థలో విధి విధానాలు, న్యాయ సూత్రాల అమలుపై కొత్త చర్చలకు తెరలేపాయి.

Naresh chandan
Last updated: మార్చి 14, 2026 12:29 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..
POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..

అక్షరటుడే, న్యూ ఢిల్లీ: Judiciary Corruption Chapter | సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశం న్యాయ వర్గాలతోపాటు విద్యావేత్తల్లో చర్చనీయాంశంగా మారింది. 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకంలో ఎన్సీఈఆర్టీ (NCERT) “న్యాయవ్యవస్థలో అవినీతి” అంశంపై అధ్యాయం పొందుపర్చింది. దీనిని రూపొందించిన ముగ్గురు నిపుణులపై సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలపై పలువురు న్యాయ, విద్యా నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Contents
  • Judiciary Corruption Chapter | కోర్టు ఆక్షేపణలు
    • Judiciary Corruption Chapter | పాఠ్యపుస్తకాల తయారీకి దూరం
      • వాదనలు వినకుండానేనా..
      • సోషల్ మీడియాపై సైతం..
      • న్యాయ వర్గాల్లో చర్చ

Judiciary Corruption Chapter | కోర్టు ఆక్షేపణలు

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ మార్చి 11న ప్రొఫెసర్ సుపర్ణా దివాకర్, మిషెల్ డానినో, అలోక్ ప్రసన్న కుమార్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ముగ్గురు ఆచార్యులు కూడా భారత న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేకుండా.. లేదంటే కావాలనే వాస్తవాలను తప్పుగా ప్రతిబింబిస్తూ ఎనిమిదో తరగతి విద్యార్థుల ఎదుట న్యాయవ్యవస్థను తప్పుగా చూపించారని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Judiciary Corruption Chapter | పాఠ్యపుస్తకాల తయారీకి దూరం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ నిధులు పొందే విద్యాసంస్థలు భవిష్యత్తులో పాఠ్యపుస్తకాల రూపకల్పన / సిలబస్ తయారీలో సదరు ముగ్గురు ప్రొఫెసర్లతో ఎలాంటి పనులు పెట్టుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వాదనలు వినకుండానేనా..

అయితే సుప్రీంకోర్టు తాజా ఆదేశంపై కొందరు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా “ఆడి ఆల్టరం పార్టమ్” (Audi Alteram Partem) అనే న్యాయ సూత్రం ప్రకారం..  ఎవరిపైనా చర్య తీసుకునే ముందు వారికి తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఈ కేసులో సదరు ముగ్గురు విద్యా నిపుణులను పిలిచి వారి అభిప్రాయం వినకుండానే కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాపై సైతం..

ఇక ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో “బాధ్యతారహితంగా” వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

న్యాయ వర్గాల్లో చర్చ

ఈ పరిణామం న్యాయ వ్యవస్థలో సహజ న్యాయం (Natural Justice), వ్యక్తిగత హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చకు దారి తీసింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిరక్షక సంస్థగా పౌరుల మౌలిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Menaka Guruswamy Rajya Sabha | అందరి దృష్టి ఆ లాయర్‌పైనే.. ఎందుకంటే?
Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా
Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
TAGGED:education policy IndiaIndian legal newsjudiciary debate IndiaNCERT class 8 social scienceNCERT textbook controversySupreme Court news Indiatextbook controversy Indiaudiciary corruption chapter
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article LPG Supply Monitoring | ఎల్​పీజీ కృత్రిమ కొరత.. సర్కారు కీలక నిర్ణయం.. ఇక పర్యవేక్షణ కట్టుదిట్టం! LPG Supply Monitoring | ఎల్​పీజీ కృత్రిమ కొరత.. సర్కారు కీలక నిర్ణయం.. ఇక పర్యవేక్షణ కట్టుదిట్టం!
Next Article March 14 Horoscope | స్నేహితుల అండతో తీరనున్న ఆర్థిక కష్టాలు.. ఈ రాశుల వారికి అదృష్టం వరించినట్లే! March 14 Horoscope | స్నేహితుల అండతో తీరనున్న ఆర్థిక కష్టాలు.. ఈ రాశుల వారికి అదృష్టం వరించినట్లే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?