అక్షరటుడే, హైదరాబాద్: March 14 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో Silver Prices కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్ మార్కెట్లో మార్చి 14వ తేదీ (శనివారం) నాటికి బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ముఖ్యంగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న మహిళలకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించినట్టైంది. మార్కెట్ నిపుణుల ప్రకారం నిన్న ఒక్కరోజులోనే బంగారం ధరలు రూ.1500కుపైగా తగ్గాయి.
గత రెండు మూడు రోజుల ట్రెండ్‌ను పరిశీలిస్తే తులం బంగారం ధర దాదాపు రూ.3000 వరకు తగ్గింది. అదే విధంగా వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. ఒక్కరోజులోనే వెండి ధర కిలోకు రూ.10 వేలకుపైగా తగ్గుముఖం పట్టింది.
March 14 Gold Rates | తగ్గుతున్న ధరలు..53
తాజా మార్కెట్ ధరలను పరిశీలిస్తే..
- హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,680 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.
- దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,830 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,440గా ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,680 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,290గా కొనసాగుతోంది.
- చెన్నైలో మాత్రం బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,550గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,990గా నమోదైంది.
- బెంగళూరు, కేరళలో కూడా హైదరాబాద్ ధరలతో సమానంగా 24 క్యారెట్ల బంగారం రూ.1,60,680, 22 క్యారెట్ల బంగారం రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
- March 14 Gold Rates |
వెండి ధరల విషయానికొస్తే హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,89,900 వద్ద ట్రేడవుతోంది. ఇతర నగరాల్లో మాత్రం ఇది కొంచెం తక్కువగా ఉండి సుమారు రూ.2,79,800 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ మారడానికి అనేక కారణాలు ఉంటాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ఇంపోర్ట్ డ్యూటీలు, పన్నులు వంటి అంశాలు కీలకంగా ప్రభావం చూపుతాయి. ఈ అన్ని అంశాల సమ్మిళిత ప్రభావంతోనే దేశవ్యాప్తంగా రోజువారీగా బంగారం ధరలు Gold Rates నిర్ణయించబడతాయి.
పెళ్లిళ్లు, పండుగలు వంటి శుభకార్యాల్లో బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకే ధరలు తగ్గినప్పుడు బంగారం కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.

