అక్షరటుడే, ఇందూరు: SSC Exams | పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు పరీక్షను నిర్వహించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది.
జిల్లావ్యాప్తంగా మొత్తం 144 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ (Flying Squad) బృందాలు పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. పరీక్ష కేంద్రాల (Examination Centers) వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కోలాహలం నెలకొంది. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్ర లోపలికి అనుమతించారు.
SSC Exams | ఉదయం 9.30 నుంచి ప్రారంభం..
ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 14వ తేదీ తెలుగు, 18న హిందీ, 23న ఆంగ్లం, 28న గణితం, ఏప్రిల్ 2న భౌతిక శాస్త్రం, ఏప్రిల్ 7వ తేదీన జీవశాస్త్రం, 13న సాంఘిక శాస్త్రం పరీక్షలు ఉన్నాయి. అయితే భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగనున్నాయి.

SSC Exams | పటిష్టమైన ఏర్పాట్లు..
పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. అయితే ఈసారి గతంలో మాదిరిగా కాకుండా ఏకంగా నెల రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. ఒక్కో పరీక్షకు సుమారు నాలుగు రోజులు విరామం లభించనుంది. ఈ సెలవు రోజుల్లో పాఠశాలల్లో స్టడీ అవర్స్‌కు హాజరయ్యేలా విద్యాశాఖ (Education Department) ప్రణాళిక రూపొందించింది.
ఇది కూడా చదవండి..: Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన

