అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Murder Case | హైదరాబాద్ (Hyderabad) హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్యని క్షణికావేశంలో సుత్తితో కొట్టి భర్త హత్య చేశాడు.
హయత్ నగర్ (Hayathnagar) పరిధిలోని పసుమాముల గ్రామంలో ఆంజనేయులు, ఉమారాణి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సైతం గొడవ జరగడంతో ఆంజనేయులు క్షణికావేశంలో తన భార్యను సుత్తితో కొట్టాడు.
Hyderabad Murder Case | పెయింట్ డబ్బా పడిందని…
భర్త దాడితో ఉమారాణి తీవ్రంగా గాయపడి కిందపడిపోయింది. రక్తపు మడుగులో ఉన్న తన భార్యను చూసి భయపడిన నిందితుడు ప్రమాదవశాత్తు పెయింట్ డబ్బా తలపై పడిందని నాటకం ఆడాడు. స్థానికులకు అలాగే చెప్పి.. యశోద ఆస్పత్రి (Yashoda Hospital)కి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెయింట్ డబ్బా పడిందని తండ్రి చెప్పిన విషయంపై కూతుళ్లకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆంజనేయులును అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం బయట పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Murder Case | వాచ్‌మన్ దంపతుల హత్య
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో దంపతుల హత్య కలకలం రేపింది. వాచ్‌మన్‌గా పనిచేస్తున్న దంపతులను రాడ్డుతో కొట్టి శుక్రవారం రాత్రి దుండగులు హత్య చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తండాకు చెందిన ధరావత్ సోములు, ధరావత్ మంగమ్మ కొంతకాలంగా నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. అర్ధరాత్రి వారిని దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
ఇది కూడా చదవండి..: Gas Price Impact | గ్యాస్ కొరత బూచీ.. ధరలు పెంచేస్తున్న హోటల్, హాస్టల్ నిర్వాహకులు!

