అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Outer Ring Road | కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి (venkata ramana reddy mla) కోరారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని (Minister nitin gadkari ) కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Kamareddy Outer Ring Road | ఢిల్లీ పర్యటనలో భాగంగా..
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే శనివారం కేంద్ర మంత్రిని కలిశారు. గతంలో రూ.550 కోట్ల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవుతో కామారెడ్డి చుట్టు ఔటర్ రింగు రోడ్డు (central road infrastructure fund) విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి స్థల పరిశీలన, (kamareddy politics news) వ్యయం ప్రణాళికలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారుల(telangana highway projects) పొడిగింపు, అభివృద్ధి, నూతన రహదారుల ఏర్పాటు గురించి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్టియర్ ఫండ్ కింద (telangana road infrastructure) లింగాపూర్ నుంచి టేక్రియాల్ వరకు రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని మంత్రికి విన్నవించినట్లు తెలిపారు. రింగు రోడ్డు పనుల ప్రణాళిక వేగవంతం చేయటానికి అధికారులను మంత్రి ఆదేశించారని, రూ.50 కోట్ల నిధుల కేటాయింపు విషయమై కూడా సానుకులంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.


