Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు

నిజామాబాద్

Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఫీజు బకాయిల కోసం రూ.15వేలు కోట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 14, 2026 6:54 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Fee Reimbursement Funds |
Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు

అక్షరటుడే, కామారెడ్డి: Fee Reimbursement Funds | వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఫీజు బకాయిల కోసం రూ.15వేలు కోట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం ( bc students association) జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Contents
  • Fee Reimbursement Funds | రెండేళ్ల ప్రభుత్వ నిధులపై..
    • Fee Reimbursement Funds | రాష్ట్ర ప్రభుత్వానివి అబద్ధపు మాటలు..
      • విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్​ ముఖ్యం..

Fee Reimbursement Funds | రెండేళ్ల ప్రభుత్వ నిధులపై..

రెండేళ్ల ప్రభుత్వ నిధుల విడుదలపై శ్వేతపత్రం (telangana education funding) విడుదల చేయాలని నీల నాగరాజు అన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ పథకాన్ని (student fee reimbursement) నీరుగారిస్తే ప్రభుత్వ పీఠం కదిలిస్తామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఈ బడ్జెట్​లో (telangana budget demand) ఫీజులకు రూ.పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్​తో ఈనెల 15వ తేదీన హైదరాబాద్​లోని ఇందిరాపార్క్ (student protest hyderabad) వద్ద ‘ఫీజు పోరు’ దీక్ష చేపడుతున్నామని తెలిపారు. అధికారంలోకి రాగానే ఫీజుల బకాయిలను విడుదల చేస్తామని, బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లిస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చిందన్నారు. రూ.ఐదు లక్షలతో ప్రతి విద్యార్థికి విద్యార్థి భరోసా కార్డులను అందజేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నేటి వరకు అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరమన్నారు.

Fee Reimbursement Funds | రాష్ట్ర ప్రభుత్వానివి అబద్ధపు మాటలు..

గత రెండేళ్ల కాలంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్​మెంట్​ బకాయిలను చెల్లించాలని రాష్ట్రమంతా విద్యార్థులంతా ఉద్యమిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉందని అబద్ధపు మాటలు (education policy telangana) చెబుతుందని నాగరాజు మండిపడ్డారు. రూ. ఏడు వేల కోట్లు ఫీజుల బకాయిలు ఇవ్వలేని ప్రభుత్వం గత రెండేళ్లు బడా కాంట్రాక్టర్లకు రూ.70వేల కోట్లు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఫీజులు ఇవ్వలేని ప్రభుత్వం ఒక వైపు రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం పెడుతున్నారని, 22 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్​ ముఖ్యం..

విద్యార్థులకు కావాల్సింది స్కూటీలు, ఎంగిలి మెతుకులు కాదని, ఆత్మగౌరవంతో చదువుకోవడానికి ఫీజుల రీయింబర్స్​మెంట్​ కావాలన్నారు. బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఇప్పటివరకు రాష్ట్రంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్​లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఫీజు పోరు దీక్షలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాయి విగ్నేష్, రాజ్ కుమార్, మనిరాజ్, సుమన్, గణేష్, శివ, నిఖిల్, సందీప్, వరుణ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Modi Congress Criticism | విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్​.. ప్రధాని మోదీ విమర్శలు

Nareddy Mohan Reddy | రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మృతి
Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా
Student Death Investigation | విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల న్యాయపోరాటం.. పోస్టుమార్టంకు పోలీసుల ఆదేశం
Sanitation Workers Felicitation | పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
Bandi Sanjay Support | అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కేంద్ర మంత్రి బండి సంజయ్​
TAGGED:bc students associationEducation Policy TelanganaStudent fee reimbursementstudent protest hyderabadtelangana budget demandtelangana education funding
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article IndiGo Flight Services IndiGo Flight Services | ‘ఇండిగో’ నుంచి కీలక అప్​డేట్​.. మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన యూరప్ మార్గాల్లో విమాన సేవలు
Next Article Medak Road Accident Medak Road Accident | మెదక్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?