అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Traffic Restrictions | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో LB స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ (Iftar) విందు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ తెలిపారు.
ఎల్బీ స్టేడియం (LB Stadium)లో దావత్-ఎ-ఇఫ్తార్ – 2026′ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ (బాబు జగ్జీవన్‌రామ్) విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్, AR పెట్రోల్ పంప్ వద్ద నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి AR పెట్రోల్ పంప్ వైపు వచ్చే ట్రాఫిక్, BJR విగ్రహం వద్ద SBI (Abids), నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లించనున్నారు.
Hyderabad Traffic Restrictions | ప్రత్యామ్నాయ మార్గాల్లో..
సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వైపు వచ్చే వాహనాలు సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నాంపల్లి వైపు వెళ్లాలి. లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, BJR విగ్రహం సర్కిల్, SBI గన్‌ఫౌండ్రీ, AR పెట్రోల్ పంప్, KLK భవనం, లిబర్టీ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.

Hyderabad Traffic Restrictions | ఆర్టీసీ బస్సులు
రవీంద్ర భారతి నుంచి BJR విగ్రహం వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సులు, ట్రాఫిక్ పరిస్థితి, అవసరాన్ని బట్టి, AR పెట్రోల్ పంప్ వద్ద నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం కలిగితే ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలని కోరారు.
దీనిని కూడా చదవండి : Telangana Heavy Rains | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

