అక్షరటుడే, బోధన్: Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠితో (Collector Ila Tripathi) కలిసి శనివారం సందర్శించారు.
Godavari Pushkaralu Preparations |వచ్చే ఏడాది జూన్ నుంచి..
వచ్చే ఏడాది 2027లో (godavari pushkaralu 2027) జూన్ 26వ తేదీ నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను (godavari river festival) పురస్కరించుకుని జిల్లాలోని ప్రధానమైన కందకుర్తి పుష్కర ఘాట్‌ను (kandakurthi ghat development) క్షేత్రస్థాయిలో సందర్శించి, చేపట్టాల్సిన పనుల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గోదావరి, మంజీర, హరిద్ర నదుల కలయికతో త్రివేణి సంగమంగా (triveni sangam kandakurthi) ప్రసిద్ధి గాంచిన కందకుర్తి ప్రాంతానికి పుష్కర స్నానాల (Godavari Pushkaralu Preparations) కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. గత పుష్కరాలను బట్టి చూస్తే ఈసారి కూడా ప్రతి రోజు సగటున రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యాలు ఏర్పడకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా పక్కాగా పనులు జరిపించాలని అధికారులను ఆదేశించారు.
Godavari Pushkaralu Preparations | వాహనాల పార్కింగ్ కోసం..
వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి (telangana temple events), షామియానాలు, దుస్తులు మార్చుకునే గదులు వంటివి అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు అన్నారు. వీఐపీ, వీవీఐపీల కోసం కొత్తగా మరో ఘాట్ నిర్మించాలని సూచించారు. అన్ని ఘాట్ల వద్ద భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా రెయిలింగ్, రక్షణ కంచె ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఘాట్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి..
పుష్కర ఘాట్ వద్ద అవసరమైన వాటికి పెయింటింగ్ చేయించి ఆకట్టుకునే రీతిలో పరిసరాలను ఆకర్షణీయంగా, అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భక్తుల నుండి ఏచిన్న ఫిర్యాదుకు సైతం ఆస్కారం (bodhan district news) లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రధాన మార్గం నుంచి పుష్కర ఘాట్ల వరకు రోడ్డు వెడల్పు, మరమ్మతులు జరిపించాలన్నారు. అవసరమైన చోట కల్వర్టులు, వంతెనల (pilgrimage arrangements telangana) నిర్మాణాలు కూడా జరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యానికి తావు లేకుండా చేపట్టాల్సిన ప్రతి పనిని గుర్తిస్తూ సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలెర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

