Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Musi Beautification Project | ఇళ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు : కేటీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Musi Beautification Project | ఇళ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు : కేటీఆర్​

హైదరాబాద్తెలంగాణ

Musi Beautification Project | ఇళ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు : కేటీఆర్​

మూసీ మురికి కూపంగా మారింది కాంగ్రెస్‌ హయాంలోనే అని కేటీఆర్​ అన్నారు. గతంలో చేసిన పాపానికి ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని​ డిమాండ్​ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 14, 2026 9:04 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Musi Beautification Project

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Musi Beautification Project | మూసీ మురికి కూపంగా మారింది కాంగ్రెస్‌ హయాంలోనే అని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మూసీ అభివృద్ధికి చేపట్టిన చర్యలపై హిమాయత్ సాగర్ వద్ద ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Contents
  • Musi Beautification Project | ఆపమని చెప్పలేదు
    • Musi Beautification Project | గాంధీ విగ్రహం కోసం..
      • Musi Beautification Project | నీళ్లను ఎక్కడ వదలాలి

మూసీ విషయంలో గతంలో చేసిన పాపానికి కాంగ్రెస్‌ (Congress) పార్టీ చెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలని కేటీఆర్​ డిమాండ్​ చేశారు. మూసీ ప్రాజెక్టు (Musi Project)తో వేలాది కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీని ప్రక్షాళన చేసేందుకు బీఆర్‌ఎస్‌ మంచి ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. మంచి రేవుల నుంచి ఘట్కేసర్‌ వరకు 57కి.మీ. పరిధిలో మూసీ రూపం మార్చాలనుకున్నామని పేర్కొన్నారు. నదిపై 15 బ్రిడ్జ్‌లు నిర్మించాలని ప్లాన్‌ చేశామన్నారు.

Musi Beautification Project | ఆపమని చెప్పలేదు

మూసీ సుందరీకరణ ఆపమని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ఎవరు చెప్పలేదని కేటీఆర్​ అన్నారు. కానీ పేదలను ఇబ్బంది పెట్టకుండా చేయమనే చెప్పామన్నారు. 2016–17 సంవత్సరంలో రూ.16,634 కోట్లతో మూసీ సుందరీకరణ చేసేందుకు, కేసీఆర్ హయాంలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదన్నారు.

Musi Beautification Project | గాంధీ విగ్రహం కోసం..

గాంధీ మునిమనవడు కూడా గాంధీ విగ్రహం వద్దని చెప్తున్నారని మాజీ మంత్రి అన్నారు. మహాత్ముడి పేరు చెప్పి ఇండ్లు కూల్చి, ఆయనకు చెడ్డ పేరు తీసుకురావొద్దు అని తుషార్ గాంధీ చెప్పారన్నారు. మేధా పాట్కర్ లాంటి మేధావులు కూడా రేవంత్ రెడ్డి చర్యలకు అడ్డు చెప్తున్నారని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం చేస్తున్నారా, భూముల కోసం చేస్తున్నారా అని ప్రశ్నించారు.

brs 1

Musi Beautification Project | నీళ్లను ఎక్కడ వదలాలి

ఎస్టీపీ (STP)లో ట్రీట్మెంట్ చేసిన నీళ్లను మూసీలోకి వదలొద్దని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్​ అన్నారు. ‘మూసీలోకి కాకుకండా మీ ఇంటి వెనక వదలాలా’ అని ప్రశ్నించారు. 54 నాలాలను ఒకదగ్గరికి తీసుకువచ్చి వాటిని ట్రీట్ చేసి.. మూసీలోకి వదులుతామని తెలిపారు. ఇది కూడా తెలియకుండా రేవంత్ రెడ్డి మున్సిపల్ మంత్రి ఎలా అయ్యారని ఎద్దేవా చేశారు.

మూసీ ప్రాజెక్టు కోసం కూలగొట్టే ఒక అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు జర్నలిస్టులు ఉన్నారని, వారిని కాకా పట్టడానికి రేవంత్​రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆ అపార్ట్​మెంట్ పక్కనే వాళ్ళకి 7 ఎకరాలు ఇస్తానని, అందులో అంతకంటే మంచి అపార్ట్‌మెంట్‌లు కట్టిస్తాను చెబుతున్నారన్నారు. మరి హిమాయత్‌ సాగర్ (Himayath Sagar) లో బస్తీ ప్రజలకు కూడా పక్కనే స్థలం ఇస్తారా అని ప్రశ్నించారు.

దీనిని కూడా చదవండి : Telangana Heavy Rains | రైతులకు అలెర్ట్​.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన

Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్
Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్​
Harish Rao Criticism | ప్రజలను మోసం చేసేందుకే ‘99 రోజుల ప్రణాళిక’ : హరీశ్​రావు
TAGGED:BRS party newsHyderabad Musi projectKTR statementMusi beautification projectMusi River DevelopmentTelangana politics news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే! Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
Next Article vedanta సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీస్తే భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు: వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?