Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీస్తే భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు: వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీస్తే భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు: వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్

బిజినెస్​

సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీస్తే భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు: వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 14, 2026 10:04 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
vedanta

హైదరాబాద్: భారతదేశపు అపారమైన సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీయడానికి నిర్ణయాత్మకమైన ముందడుగు వేయాలని వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ దేశీయ అన్వేషణ, ఉత్పత్తిని వేగవంతం చేయాలని నొక్కి చెప్పారు. దేశంలో అపారమైన నిక్షేపాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ మనం 90 శాతం చమురు, 95 శాతం రాగి, 99.5 శాతం బంగారాన్ని విదేశాల నుంచే తెప్పించుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు.

మన దేశ భౌగోళిక నిక్షేపాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనవని, వీటిని సరిగ్గా వినియోగించుకుంటే భారతదేశ ఇంధన ఖనిజ భద్రతను గణనీయంగా బలోపేతం చేసే అవకాశం ఉంటుందని వివరించారు. అనుకూలమైన విధానాలు వేగవంతమైన అనుమతులు లభిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు వనరుల కంపెనీలకు ఉత్పత్తిని అనేక రెట్లు పెంచే సామర్థ్యం ఉందని, అలాగే తక్కువ పనితీరు కనబరుస్తున్న ప్రభుత్వ ఆస్తులు కూడా సరైన పెట్టుబడితో మెరుగైన ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు.

గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హిందుస్థాన్ జింక్, బాల్కో వంటి సంస్థలను ప్రైవేటీకరించిన తర్వాత వాటి ఉత్పత్తి 5 నుండి 10 రెట్లు పెరిగిందని, ఇది మన దేశ వనరుల రంగంలో ఉన్న సామర్థ్యాన్ని నిరూపిస్తోందని అగర్వాల్ తెలిపారు. గత పదేళ్లలో వేదాంత సంస్థ ప్రభుత్వ ఖజానాకు 4.5 లక్షల కోట్ల రూపాయలు జమ చేసిందని ఆయన గుర్తు చేశారు. వ్యవస్థాపకులను శక్తివంతం చేసేందుకు నియంత్రణ నిబంధనలను సరళీకరించాలని, సుదీర్ఘ అనుమతులకు బదులుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ నమ్మకం ఆధారిత పాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. పశ్చిమ ఆసియా సంక్షోభం వంటి పరిస్థితుల నేపథ్యంలో చమురు, గ్యాస్, బొగ్గు వ్యూహాత్మక లోహాల అన్వేషణను వేగవంతం చేయడం దేశ భద్రతకు ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

రాబోయే ఏళ్లలో ఇంధన అవసరాలు రెట్టింపు కానున్న నేపథ్యంలో దేశీయ వనరుల వెలికితీత ద్వారా భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని అగర్వాల్ స్పష్టం చేశారు. చివరగా భారత్ ప్రపంచస్థాయి వనరుల కంపెనీలను నిర్మించగలదని, ఈ రంగంలో పెట్టుబడులకు మన దేశం అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానమని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Fortune Atta | ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ పిండి ఉత్పత్తుల శ్రేణి విస్తరణ.. ‘ఫార్చ్యూన్ మల్టీగ్రైన్ అట్టా’ విడుదల
Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట
Iran Gulf Attacks | గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు
TAGGED:Anil AgarwalDomestic ProductionEconomic GrowthEnergy SecurityImport DependenceNatural ResourcesSelf-certificationVedanta
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Musi Beautification Project Musi Beautification Project | ఇళ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు : కేటీఆర్​
Next Article Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు! Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?