అక్షరటుడే, ఇందూరు: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని (bc students protest) బీసీ సంక్షేమ సంఘ (BC Welfare Association) అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar) డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఫీజు పోరు దీక్ష’కు తరలి వెళ్లారు.
Fee Reimbursement Dues | బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో..
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ (indira park protest) వద్ద ధర్నా చౌక్‌లో ‘ఫీజు పోరు దీక్ష’ నిర్వహిస్తున్నట్లు నరాల సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ (scholarship pending issue) డబ్బులు విడుదల కాకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు (student welfare schemes) ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు (telangana bc welfare) రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్‌తో పాటు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్, చంద్రకాంత్, సాయి బసవ, దయానంద్, సందేశ్, సందీప్, నరేష్, శివ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Nepali Gang Theft | రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ

