Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్​ పేరిట భూములు పంచుకునే యత్నం : కవిత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్​ పేరిట భూములు పంచుకునే యత్నం : కవిత

తెలంగాణ

Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్​ పేరిట భూములు పంచుకునే యత్నం : కవిత

మూసీ ప్రాజెక్ట్​ పేరిట భూములను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారని కవిత అన్నారు. జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: మార్చి 15, 2026 12:56 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Musi Project Allegations

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్​ పేరిట భూములను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు.

Contents
  • Musi Project Allegations | ఇంట్లో నుంచి ఇస్తున్నారా..
    • Musi Project Allegations | వ్యర్థాలు కలవకుండా చూడాలి
      • Musi Project Allegations | హైడ్రాపై ఆగ్రహం

మూసీ సుందరీకరణ అని నది పక్కన ఉన్న భూములను ప్రపంచ బ్యాంక్ (World Bank)​, రియల్​ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించారు. మూసీ ప్రాజెక్ట్​ డీపీఆర్​ సిద్ధం కాకముందే ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. మూసీ సుందరీకరణ మొదటి దశ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం 2025 సెప్టెంబర్​లో చెప్పిందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల మాట్లాడుతూ.. రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లు అవుతుందన్నారు. డీపీఆర్​ లేకుండానే.. ఆరు నెలల్లో ఇంత ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు.

Musi Project Allegations | ఇంట్లో నుంచి ఇస్తున్నారా..

గాంధీ విగ్రహం కోసం రూ.70 కోట్లు అవుతుందని సీఎం చులకనగా చెబుతున్నారని, ఆ డబ్బులు రేవంత్​రెడ్డి ఇంట్లో నుంచి ఇస్తున్నారా అని కవిత ప్రశ్నించారు. నిర్వాసితులను పక్కన పెట్టి.. మూసీ పక్కన ఉన్న భూములను పంచుకునే కుట్ర జరుగుతోందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి ప్రజెంటేషన్​కు మంత్రులు, ఎమ్మెల్యేలు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారులను పిలిచారన్నారు. ఇళ్లు కోల్పోతున్న వారిని హౌస్​ అరెస్ట్ చేశారని విమర్శించారు. బాధితులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు.

Musi Project Allegations | వ్యర్థాలు కలవకుండా చూడాలి

సీఎం రేవంత్​రెడ్డి ప్రజల మాట వినడం లేదని జాగృతి అధ్యక్షురాలు విమర్శించారు. 16 నాలాల నుంచి మూసీలోకి మురుగు నీరు చేరుతుందన్నారు. వాటిని నదిలో కలవకుండా ఎలాంటి చర్యలు చేపడుతారని ప్రశ్నించారు. మురుగు నీరు కలిసినప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా మూసీ ప్రక్షాళన జరగదన్నారు. మూసీ ఆక్రమణలకు గురికాకుండా, వ్యర్థాలు నదిలో కలవకుండా చూడాలని ఆమె కోరారు.

Musi Project Allegations | హైడ్రాపై ఆగ్రహం

హైడ్రా పేదల ఇళ్లు కూలుస్తోందని, పెద్దల జోలికి వెళ్లడం లేదని కవిత విమర్శించారు. హైడ్రాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిత్య రియల్టర్​ భవనం వద్ద తాము ధర్నా చేశామన్నారు. నాలాను ఆక్రమించి దానిని నిర్మించారని ఆరోపించారు. హైడ్రా దానిపై చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

దీనిని కూడా చదవండి : Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు

Goa liquor smuggling | గోవా నుంచి మద్యం.. షాక్​ ఇచ్చిన పోలీసులు
Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
Kulsum Pura ACP Tirupati | కుల్సుంపురా ఏసీపీగా తిరుపతి బాధ్యతల స్వీకరణ
Harish Rao Letter | రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా.. రాహుల్​ గాంధీకి హరీశ్​రావు లేఖ
TAGGED:Hyderabad Musi river issuekalvakuntla kavitha newsMusi project allegationsMusi river project controversyTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Fee Reimbursement Dues | Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిందే..
Next Article Mud Bath Therapy | Mud Bath Therapy | కామారెడ్డిలో మట్టి స్నానం.. ఉత్సాహంగా ముందుకొస్తున్న ఔత్సాహికులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?