Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​

జాతీయం

Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 15, 2026 4:36 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Assembly Election Schedule

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Assembly Election Schedule | దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నాలుగు రాష్టాల ఎలక్షన్​ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్​, అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్​ షెడ్యూల్​ ప్రకటించారు.

Contents
  • Assembly Election Schedule | ఐదు రాష్ట్రాల ఎలక్షన్​కూ షెడ్యూల్​
    • వివిధ దశల్లో ఎన్నికలు
      • Assembly Election Schedule | పశ్చిమ బెంగాల్​లో 294 అసెంబ్లీ స్థానాలు.. 

Assembly Election Schedule | ఐదు రాష్ట్రాల ఎలక్షన్​కూ షెడ్యూల్​

దేశంలో ఐదు రాష్ట్రాల ప్రభుత్వాల గడువు ముగియనుంది. నాలుగు రాష్ట్రాలకు సంబంధించి మేలో గడువు ముగియనుండగా.. ఒక రాష్ట్రానికి జూన్​లో ముగియనుంది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఎలక్షన్ల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసింది. ఎన్నికల్లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కలిపి 17.4 కోట్ల మంది పాల్గొననున్నారు. మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25 లక్షల మంది ఎన్నికల అధికారులను నియమించారు. మొత్తం అసెంబ్లీ 824 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో పశ్చిమ బెంగాల్​లో 294 స్థానాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్​లో 6 కోట్ల 44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

వివిధ దశల్లో ఎన్నికలు

అస్సాం, కేరళ మరియు పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ఒకే దశలో జరగనున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు మే 4న కౌంటింగ్​ జరుగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో పోలింగ్​ జరుగనుంది. ఏప్రిల్ 23 తొలిదశ, ఏప్రిల్ 29 రెండు దశ పోలింగ్ జరుగనుంది.

Assembly Election Schedule | పశ్చిమ బెంగాల్​లో 294 అసెంబ్లీ స్థానాలు.. 

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో మొత్తం 294 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ 2011 నుంచి మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధికారంలో ఉంది. కాగా.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగా.. ఈ సారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య జరిగే ఈ పోటీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పే అవకాశం ఉంది.

Assembly Election Schedule | అస్సాంలో 126 సీట్లు

అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మరోసారి అధికారం కాపాడుకునే దిశగా ముందుకు సాగుతోంది. బీజీపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి బలంతో దిగుతోంది. ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను ఎలా మార్చబోతాయో ఆసక్తికరంగా ఉంది.

కేరళ 140 సీట్లు

కేరళలో 140 సీట్లతో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధికార ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సుమారు 100 సీట్లలో స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. బీడీజేఎస్, వివిధ మిత్ర పక్షాలు పోటీ చేయనున్నాయి. ఇలా కేరళ రాజకీయాల్లో త్రిముఖ పోటీ జరుగనుంది.

Assembly Election Schedule

తమిళనాడులో 234 సీట్లు

తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల కోసం ఎన్నికలు జరుగనున్నాయి. అధికార డీఎంకే గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇక బీజేపీతో కలిసి అన్నాడీఎంకే రంగంలోకి దిగనుంది. విజయ్​ టీవీకే పార్టీ స్థాపించి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

పుడుచ్చేరీలోని 30 నియోజకవర్గాల్లో..

పుడుచ్చేరీలోని 30 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ డీఎంకే, సీపీఐలతో కలిసి ఒక కూటమిగా దిగుతోంది. ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఏఐఎడీఎంకేలు ఏకతాటపైకి వచ్చాయి. ఈ రెండు కూటముల మధ్య పోటీ జరుగనుంది.

ఇది కూడా చదవండి..: Modi Congress Criticism | విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్​.. ప్రధాని మోదీ విమర్శలు

CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం
SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!
Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
TAGGED:assam electionsassembly elections indiaelection commission indiaindia political newskerala electionspuducherry electionstamil nadu electionswest bengal elections
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article GHMC Elections BJP | GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Next Article Vaishya Leaders Felicitation | Vaishya Leaders Felicitation | వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వైశ్య ప్రజాప్రతినిధులు సన్మానం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?