అక్షరటుడే, భీమ్‌గల్: Varshith Reddy Felicitation | దేశ అత్యున్నత సర్వీసులైన సివిల్ సర్వీసెస్‌లో (civil services achievers) 259వ ర్యాంకు సాధించి ముచ్కూర్ గ్రామానికి (varshith reddy felicitation) జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వర్షిత్ రెడ్డిని (civil services rank 259) గ్రామస్థుల ఆదివారం ఘనంగా సన్మానించారు. గ్రామానికి చేరుకున్న వర్షిత్ రెడ్డికి యువకులు, పెద్దలు డప్పు చప్పుళ్లతో, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.
Varshith Reddy Felicitation | గర్వించదగ్గ విషయం..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో (upsc success story telangana) గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో పుట్టి, పట్టుదలతో శ్రమించి (muchkur village achievement) నేడు ఐఏఎస్/ఐపీఎస్ స్థాయికి ఎదగడం ముచ్కూర్ గర్వించదగ్గ విషయమని కొనియాడారు. వర్షిత్ విజయం నేటి యువతకు, విద్యార్థులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షించారు.
లక్ష్యం ఉంటే విజయం సాధ్యమే: వర్షిత్ రెడ్డి
సన్మానం అనంతరం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. తన విజయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల (upsc toppers india) ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. క్రమశిక్షణతో కూడిన పఠనం, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన యువతకు పిలుపునిచ్చారు. మారుమూల గ్రామాల నుంచి కూడా సివిల్స్ లాంటి పరీక్షల్లో విజయం సాధించవచ్చని తాను నిరూపించానన్నారు. భవిష్యత్తులో ప్రజాసేవకు అంకితమవుతానని తెలిపారు.

ఇది కూడా చదవండి: Drug Test Challenge | కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్‌కు రావాలి.. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సవాల్

